NTV Telugu Site icon

Hyderabad: హైదరాబాద్‌లో వీధి కుక్కల బీభత్సం.. చిన్నారులపై దాడి

Dogs

Dogs

హైదరాబాద్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి.. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ చిన్నారులపై దాడికి దిగుతున్నాయి. నాచారం రాఘవేంద్ర నగర్ లో సాయంత్రం చిన్నారులు వీధిలో ఆడుకుంటుండగా వీధి కుక్క వెంటపడి చిన్నారులను గాయపరిచింది. చిన్నారులను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న జిహెచ్ఎంసి సిబ్బంది కుక్కలను పట్టుకుని అక్కడి నుండి తరలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు సిబ్బంది కుక్కలను పట్టుకెళ్లాలని స్థానికులు డిమాండ్ చేశారు.

READ MORE: Minister Nara Lokesh: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అగ్రరాజ్యానికి మంత్రి నారా లోకేష్

కాగా… గతంలో హైదరాబాద్‌ శివారు మేడ్చల్ జవహర్ నగర్‌లో వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. 18 నెలల చిన్నారిపై వీధి కుక్కలు విచక్షణారహితంగా దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జవహర్ నగర్‌కు చెందిన విహాన్ (18 నెలలు) జులై 16న రాత్రి ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్నాడు. తండ్రి బయటకు వెళ్లగా.. తల్లి ఇంట్లో ఏదో పనిలో నిమగ్నమై ఉంది. చిన్నారి విహాన్ మాత్రం ఒంటరిగా ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఇదే సమయంలో అటుగా కొన్ని వీధి కుక్కలు వచ్చాయి. బాలుడిని చూడగానే.. గుర్రుమంటూ బాలుడిపై ఎగబడ్డాడు. విచక్షణారహితంగా దాడి చేశాయి. శరీరమంతా జల్లెడ లాగా కొరికేశాయి. కుక్కల దాడిలో చిన్నారి తలపై జుట్టు కూడా పెచ్చులుగా ఊడిపోయింది.