Site icon NTV Telugu

Stray Dogs: వీధి కుక్కలకు మరో చిన్నారి బలి..

Stray Dogs

Stray Dogs

Stray Dogs: వీధి కుక్కులకు చెలరేగి పోతున్నాయి.. చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా వెంబడించి మరి దాడి చేస్తున్నాయి.. హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే పలువురు ప్రాణాలు తీశాయి వీధి కుక్కలు.. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో 18 నెలల చిన్నారి సాత్విక వీధి కుక్కలకు బలిఅయ్యింది.. ఈ ఘటనతో శ్రీకాకుళం జి.సిగడాం మండలం మెట్టవలసలో తీవ్ర విషాదం నెలకొంది.. వీధిలో ఆడుకుంటున్న 18 నెలల చిన్నారిపై.. ఒక్కసారిగా దాడి చేశాయి నాలుగు వీధి కుక్కలు.. ఈ ఘటనలు చిన్నారి తీవ్రంగా గాయపడింది.. ఇక, కుక్కల దాడిని గమనించిన కుటుంబ సభ్యులు.. చిన్నారిని వెంటనే చికిత్స కోసం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారికి ప్రథమ చికిత్స చేశారు. ఆతర్వాత మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు.. అయితే, ఆ చిన్నారి ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి సాత్విక కన్నుమూసింది.. పసిపాప మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.. కుక్కల నియంత్రణపై అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని.. స్థానికులు మండిపడుతున్నారు.. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్‌ చేస్తున్నారు..

Read Also: Tamil Nadu : తమిళనాడులో దారుణం.. ఆస్పతుల్లో 300 మంది రోగుల హత్య..?

Exit mobile version