Site icon NTV Telugu

Stranger Things 5 Part 2:ఇండియాలో రికార్డ్ బ్రేకింగ్ సిరీస్ ఫైనల్ ఎపిసోడ్స్ ఎప్పుడంటే..

Stranger Things 5 Part 2,

Stranger Things 5 Part 2,

ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్న సెన్సేషనల్ సిరీస్‌లలో ‘స్ట్రేంజర్ థింగ్స్’ ఒకటి. అభిమానుల అంచనాలకు తగ్గట్టే, ఈ సిరీస్ చివరి సీజన్‌ను మేకర్స్ భాగాలుగా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తున్నారు. గత నవంబర్‌లో వచ్చిన సీజన్ 5 తొలి భాగం (పార్ట్ 1) కు సంబంధించిన 4 ఎపిసోడ్స్‌కి ప్రేక్షకుల నుంచి ఊహించని మాస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సంచలన సిరీస్ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే, ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆయా డేట్స్, ఆయా సమయాల్లో వదులుతూ వస్తున్నారు. ఈ క్రమంలో, సీజన్ 5 రెండో భాగం (పార్ట్ 2) ఇండియాలో ఎప్పుడు విడుదలవుతుందనేది కన్ఫర్మ్ అయ్యింది.

Also Read : Urvashi : తిండీ నిద్ర మానేసి రాత్రంతా అదే పని.. నా ఆరోగ్యం నాశనం చేసుకున్నా

తాజాగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సిరీస్ గ్లోబల్ రిలీజ్ టైంను అధికారికంగా ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్ (US) లో అయితే, ఈ చివరి భాగం డిసెంబర్ 25న సాయంత్రం 5 గంటలు, అలాగే 8 గంటల నుంచి ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ టైమింగ్ ప్రకారం, మన భారతదేశంలో ఈ సీజన్ పార్ట్ 2 డిసెంబర్ 26న తెల్లవారుజామున 6 గంటల 30 నిమిషాలకు స్ట్రీమ్ కానుంది. లాస్ట్ పార్ట్ కూడా ఇదే సమయంలో వచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి, ఎలెవెన్, హోప్‌కిన్స్ అండ్ గ్యాంగ్ సాహసాలను చూడాలనుకునే వాళ్లంతా ఈ తేదీ, సమయాన్ని గుర్తుపెట్టుకోండి.

Exit mobile version