NTV Telugu Site icon

Viral Video: ఇదెక్కడి క్రియేటివిటీ మావా.. వాలంటైన్స్‌ డే రోజు ఈ వింత చూశారా?

Viral Video

Viral Video

Viral Video: వాలంటైన్స్ డే రోజున సోషల్ మీడియా అంతా ప్రేమ పోస్టులతో నిండిపోయింది. ప్రేమను సెలబ్రేట్‌ చేసుకుంటూ ప్రేమ పక్షులు ఎన్నో వీడియోలు షేర్‌ చేసుకున్నారు. వాలంటైన్స్‌ వీక్‌ను ప్రేమికులంతా తమ ప్రేమను భాగస్వామికి తెలిసేలా రోజుకో రీతిలో వ్యక్తపరిచారు. అంతకు మించి అన్నట్లు వాలంటైన్స్ డే అన్నట్లు జరుపుకున్నారు. సోషల్ మీడియా అంతా ప్రేమ పోస్టులతో నిండిపోగా.. ప్రపోజ్ చేస్తూ, గిఫ్ట్‌లు ఇస్తూ రకరకాల సెలబ్రేషన్ వీడియోలు దర్శనం ఇస్తున్నాయి. వాటి మధ్య ఓ వీడియో వింతగా, వినూత్నంగా నిలిచింది. ఆవును దాని యజమాని తాడుతో కట్టి తీసుకెళ్తున్నాడు.. ఆ ఆవుపై కూడా ఓ వ్యక్తి తన ప్రియురాలికి పూలు ఇస్తూ ప్రపోజ్‌ చేస్తున్నట్లుగా రంగులు వేసి ఉంది.. అందులో ఏముంది అనుకోకండి?.. ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

Read Also: Burj Khalifa: ప్రధాని మోడీకి యూఏఈ సత్కారం.. బుర్జ్ ఖలీఫాపై వెలిగిపోయిన త్రివర్ణ పతాకం..

ఆవు ముందు రెండు కాళ్లపై ఓ స్త్రీ మూర్తి బొమ్మను, వెనుక కాళ్లపై పురుషుడి బొమ్మను రంగులతో పెయింటింగ్ వేశారు. ప్రేమికుడు పూలను ప్రియురాలికి ఇస్తున్నట్లుగా మనకు కనిపస్తుంది. ఇంకా ఆవు ముందుకు నడుస్తుంటే.. ఆ ప్రేమికుడు పూలను తన ప్రియురాలికి ఇవ్వడానికి తన వెనుకే వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. అంటే ప్రేమికుడు తన ప్రేమను వ్యక్తపరచడానికి ఆరాటపడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ వీడియో చూసి చాలా మంది ఆర్టిస్ట్ క్రియేటివిటీని మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎన్నో ప్రేమ వీడియోల మధ్య ఈ వీడియో ప్రత్యేకంగా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.