Site icon NTV Telugu

Maharashtra: మహారాష్ట్రలో వింత ఘటన.. కార్పెట్‌పై తారు రోడ్డు..

Taru Road

Taru Road

మహారాష్ట్రలో వింత ఘటన ఒకటి జరిగింద. తారు రోడ్డును కొంతమంది వ్యక్తులు చేతులతో అమాంతం ఎత్తి వేశారు. కొత్తగా వేసిన ఈ రోడ్డు అట్టముక్కలా పైకి రావడంతో అందరు విచిత్రంగా చూశారు. ఈ విషయాన్ని సదరు గ్రామస్తులు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయటంతో వైరల్‌ గా మారింది. జల్నా జిల్లాలోని అంబాద్ తాలూకాలోని కర్జాత్-హస్త్ పోఖారీలో ఘటన జరిగింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద ఈ రహదారిని నిర్మించారు.

Also Read : Airforce Practice Mission: సత్తా చాటిన భారత వైమానిక దళం.. పాకిస్థాన్-చైనాలకు గట్టి దెబ్బ

అయితే రోడ్డు మీద కార్పెట్‌ను బేస్మెంట్ లాగా పరిచి దానిపై ఈ రోడ్డును వేశారు. స్థానిక కాంట్రాక్టర్‌ ఈ రహదారిని వేశాడు. దీనిని గుర్తించిన గ్రామస్థులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఫేక్ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్‌పై మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్షానికి ఈ పనులు సాక్ష్యంగా నిలిచాయంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వేసి నాలుగు రోజులే అవుతుందని.. ఈ విధంగా చేతులతో లేపితే లేచిపోయే రోడ్లను గతంలో ఎన్నడూ చూడలేదంటున్నారు గ్రామస్థులు ఫైరర్ అవుతున్నారు. కంట్రాక్టర్లు రాత్రికి రాత్రి ఇలాంటి రోడ్లు వేసి.. చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు చేశారు. దీనిని ఆమోదించిన ఇంజనీర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

Also Read : Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై కీలక సమావేశం.. 2024 జూన్ కల్లా..

అయితే కాంట్రాక్టర్‌ మాటలు మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి. రోడ్డు నిర్మాణం కోసం జర్మన్ టెక్నాలజీని ఉపయోగించినట్లు అతను వెల్లడించాడు. రోడ్డుపై కార్పెట్ వేసి.. దానిపై తారు రోడ్డు నిర్మాణం చేసినట్లు చెబుతున్నాడు. మొత్తానికి ఫేక్‌ రోడ్డుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. కాగా 63.32 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్‌తో భారత్‌ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అయినా దేశంలో ఇంకా కొన్ని గ్రామాలకు సరైన రోడ్డు మార్గాలు లేవు.

Exit mobile version