Site icon NTV Telugu

Stone Attack on CM Jagan: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పురోగతి

Ys Jagan

Ys Jagan

Stone Attack on CM Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయనున్నారు పోలీసులు. సతీష్, దుర్గారావు ఇద్దరిని కూడా నేడు అరెస్ట్ చేయనున్నారు. ఈ కేసులో ఏ1గా రాయితో దాడి చేసిన సతీష్, ఏ2గా దుర్గారావు పై కేసు నమోదైంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీలో దుర్గారావు యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు. దుర్గారావు చెబితేనే సతీష్ దాడి చేసినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. సిమెంట్ రాయి ముక్కతో బస్సుకు 20 అడుగుల దూరం నుంచి వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై నుంచి సతీష్ దాడి చేసినట్లు తెలిసింది. రాయితో దాడి చేసిన తర్వాత సతీష్, దుర్గారావులు తమకు ఇళ్లకు వెళ్లిపోయినట్లు విచారణలో తెలిసింది. సతీష్‌తో పాటు అదుపులోకి తీసుకున్న మిగతా నలుగురి నుంచి స్టేట్ మెంట్ తీసుకుని పోలీసులు వారిని విడుదల చేయనున్నారు.

Read Also: Janasena: రాజోలులో పవన్‌కు ఎదురుదెబ్బ.. జనసేనకు కీలక నేత గుడ్‌బై

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఏప్రిల్ 13న రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. మేమంతా సిద్దం పేరుతో సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విజయవాడలో మేమంతా సిద్దం బస్సు యాత్ర సాగుతున్న సమయంలో సీఎం జగన్‌పై రాళ్లతో దాడి జరిగింది. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో జనాల్లో నుంచి విసిరిన రాయి వచ్చి జగన్‌ తలకు బలంగా తాకింది. ఈ ఘటనలో జగన్ ఎడమ కంటి కనుబొమ్మ పైభాగంలో గాయమైంది. అలాగే సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి కూడా గాయం అయింది. ఈ ఘటన జగన్ భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. జగన్‌‌కు బస్సులోనే వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అయితే ప్రథమ చికిత్స అనంతరం సీఎం జగన్.. మేమంతా సిద్దం బస్సు యాత్రను కొనసాగించారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Exit mobile version