NTV Telugu Site icon

Stock market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market

Stock Market

దేశీయ స్టాక్‌ మార్కెట్‌‌ దూకుడికి బ్రేక్ పడింది. గత వారం రోజులుగా భారీ లాభాల్లో కొనసాగిన సూచీలు.. శుక్రవారం మాత్రం నష్టాల్లో ముగిసింది. ఉదయం లాభాల్లో ప్రారంభం కాగా.. ముగింపునకు వచ్చేటప్పటికీ నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ 269 పాయింట్లు నష్టపోయి 77,209 దగ్గర ముగియగా.. నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయి 23, 501 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Ashwini Dutt: కాళ్ళు మొక్కబోయిన అమితాబ్‌.. అశ్వనీదత్‌ ఎమోషనల్‌!

నిఫ్టీలో భారతి ఎయిర్‌టెల్, ఎల్‌టీఐఎండ్‌ట్రీ, హిందాల్కో, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లాభాల్లో ట్రేడ్ అవ్వగా… రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్‌అండ్ టీ, టాటా స్టీల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక బీఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. డాలర్‌పై రూపాయి మారకం విలువ గురువారం నాటి 83.64తో పోలిస్తే శుక్రవారం 10 పైసలు పెరిగి 83.54 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Police Arrested: ప్రాణాంతక స్టంట్ చేసిన ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు..