మొత్తానికి భారీ నష్టాల్లోంచి దేశీయ మార్కెట్ సూచీలు లాభాల్లోకి వచ్చాయి. బుధవారం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ముగింపు వరకు యధావిధిగా కొనసాగాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 2,303 పాయింట్లు లాభపడి 74, 382 దగ్గర ముగియగా… నిఫ్టీ 688 పాయింట్లు లాభపడి 22, 573 దగ్గర ముగిసింది.
మంగళవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. మొత్తానికి ఒక్క రోజు గ్యాప్ తర్వాత లాభాల్లోకి రావడం మంచి పరిణామం. దీంతో మదుపర్లకు భారీ ఊరట లభించింది. దాదాపు అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ట్రేడ్ అయ్యాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 4 శాతం, స్మాల్ క్యాప్ సూచీలు 2.5 శాతం పెరిగాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఎలక్ట్రికల్స్, ఎస్‌బీఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఆర్‌ఈసీ ఎన్‌ఎస్‌ఈలో షేర్లు యాక్టివ్‌గా సాగాయి.
సెన్సెక్స్ సూచీలో హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, ఐటీసీ, మారుతీ, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, విప్రో, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగాయి.
