NTV Telugu Site icon

Stock Markets: వరుస లాభాలకు బ్రేక్‌.. భారీగా పతనమైన మార్కెట్లు

Stockmarket

Stockmarket

Stock Markets: దేశీయ మార్కెట్‌ వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఉదయం నుంచే నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఏ మాత్రం కోలుకోలేకపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 885.60 పాయింట్లు లేదా 1.08 శాతం పతనమై 80,981 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 293.20 పాయింట్లు లేదా 1.17 శాతం నష్టపోయి 24,717.70 వద్ద స్థిరపడింది.

Read Also: Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ముగ్గురు తల్లులు.. పిల్లలతో సెలబ్రేషన్స్

ఒక్క సెషన్‌లోనే దాదాపు రూ.5లక్షల కోట్ల మదుపర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.60గా ఉంది. ఐషర్ మోటార్స్‌, ఐషర్‌ మోటర్స్‌, మారుతీ సుజుకీ, టాటా మోటర్స్‌, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు టాప్‌ లూజర్స్‌గా నష్టాలను చవిచూడగా.. దివీస్‌ ల్యాబ్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ ఫార్మా, కోటక్‌ మహీంద్రా షేర్లు టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి.