దేశీయ స్టాక్ మార్కె్ట్ వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసింది. ఉదయం సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అయినా.. అరంతరం వేగంగా పుంజుకుంది. ఇక నిఫ్టీ అయితే మరోసారి ఆల్‌టైమ్ రికార్డ్ సొంతం చేసుకుంది. శుక్రవారం 23, 490 తాజా మార్కు చేరింది. వచ్చే నెలలోనే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ జోష్ కనిపించినట్లుగా తెలుస్తోంది. సెన్సెక్స్ 181 పాయింట్లు లాభపడి 76, 992 దగ్గర ముగియగా.. నిఫ్టీ 66 పాయింట్లు లాభపడి 23, 465 దగ్గర ముగిసింది. ఇక నిఫ్టీ 23, 500 మార్కు రీచ్ అయ్యేందుకు అతి చేరువలో ఉంది. ఇక ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Maharashtra: పూణె పోర్స్చే ఘటన తరహాలో మహారాష్ట్రలో మరో ప్రమాదం..
ఐటీ షేర్లు అండర్ పెర్ఫార్మ్‌ను నమోదు చేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ 1 శాతం చొప్పున లాభపడ్డాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్ ర్యాలీ తీశాయి. BSE మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ ఒక్కొక్కటి 1 శాతం లాభపడతాయి. ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ట్రేడ్ అయ్యాయి. గురువారం నాటి ముగింపు 83.54తో పోలిస్తే.. డాలర్‌కు భారత రూపాయి విలువ శుక్రవారం 83.56 దగ్గర ఫ్లాట్‌గా ముగిసింది.
ఇది కూడా చదవండి: TATA: మొబైల్స్ తయారు చేయనున్న టాటా కంపెనీ!