దేశీయ స్టాక్మార్కెట్లు నేడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FII) కొనుగోళ్లు, గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల మద్దతుతో భారీ లాభాల్లో ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు రోజంతా లాభాల్లోనే పయనించాయి. బిఎస్ఈ సెన్సెక్స్ 772.75 పాయింట్లు (0.95%) పెరిగి 81,879.40 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 210.40 పాయింట్లు (0.84%) పెరిగి 25,255.05 స్థాయికి చేరుకుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ అత్యధికంగా 1,051.15 పాయింట్లు (1.76%) పెరిగి 60,792.40 వద్ద స్థిరపడింది.
ఆటోమొబైల్, ఏవియేషన్ , రీటైల్ రంగాలు మార్కెట్ లాభాలకు ప్రధాన కారణమయ్యాయి. మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) షేరు 5.30 శాతం లాభపడి రూ. 3,465.00 కి చేరింది. ఇండిగో (Interglobe Avi) 4.33 శాతం పెరిగి రూ. 5,665.00 వద్ద, ట్రెంట్ (Trent) 3.32 శాతం పెరిగి రూ. 3,222.70 వద్ద, టాటా స్టీల్ 2.40 శాతం పెరిగి రూ. 189.28 వద్ద క్లోజ్ అయ్యాయి.
కొన్ని ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో నష్టాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్ 1.10% నష్టపోయి రూ. 1,571.60 వద్ద ముగిసింది. టెక్ మహీంద్రా 0.91 శాతం తగ్గి రూ. 1,788.50, హెచ్సీఎల్ టెక్ 0.85 శాతం తగ్గి రూ. 1,395.00, నెస్లే 0.76 శాతం తగ్గి రూ. 1,288.00, టైటాన్ 0.70 శాతం తగ్గి రూ. 4,970.00 వద్ద స్థిరపడ్డాయి. పబ్లిక్ సెక్టార్, ఆటో రంగాలు సూచీలను లాభాల వైపు నడిపించగా, క్వార్టర్ ఫలితాలు పెట్టుబడిదారులలో సానుకూల ఉత్సాహాన్ని నింపాయి.

