Site icon NTV Telugu

Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు… సెన్సెక్స్ 6000 పాయింట్లు, నిఫ్టీ 1900 పాయింట్లు పతనం

New Project (31)

New Project (31)

Stock Market Crash: ఓ వైపు దేశంలో లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా మరోవైపు వస్తున్న ట్రెండ్స్ స్టాక్ మార్కెట్ కు రుచించడం లేదు. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ క్షీణతతో ప్రారంభమై కొద్దిసేపటికే సునామీగా మారింది. ప్రస్తుత సమాచారం ప్రకారం బీఎస్సీ సెన్సెక్స్ 6000 పాయింట్లకు పైగా ట్రేడవుతుండగా, ఎన్సె్స్సీ నిఫ్టీ 1900 పాయింట్లకు పైగా పడిపోయింది.

72000 దిగువకు సెన్సెక్స్
మంగళవారం ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌లో తగ్గుదల ట్రెండ్‌ ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. బీఎస్ఈ సెన్సెక్స్ 1700 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మధ్యాహ్నం 12.20 గంటల సమయానికి 6094 పాయింట్లు పడిపోయి 70,374 స్థాయికి చేరుకుంది. మరోవైపు, నిఫ్టీ ఇండెక్స్ దాదాపు 1947 పాయింట్ల భారీ పతనంతో 21,316 స్థాయి వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 7.97 శాతం పతనంతో ట్రేడవుతుండగా, నిఫ్టీ 50 8.37 శాతం పడిపోయింది.

Read Also:Manamey : గ్రాండ్ గా శర్వానంద్ ‘మనమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా రానున్న ఆ స్టార్ హీరో..?

30 లక్షల కోట్ల పెట్టుబడి
సోమవారం చివరి ట్రేడింగ్ రోజున సెన్సెక్స్ 2500 పాయింట్ల లాభంతో.. నిఫ్టీ 733 పాయింట్ల లాభంతో ముగియగా, నేడు రెండు సూచీలు వేగంగా పతనమవుతున్నాయి. స్టాక్ మార్కెట్‌లో ఈ పతనం కారణంగా, పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూశారు. బీఎస్సీ మార్కెట్ క్యాప్ ప్రకారం.. వారి సంపద విలువ సుమారు రూ. 30 లక్షల కోట్లు.

రిలయన్స్ నుండి టాటా వరకు
స్టాక్ మార్కెట్‌లో ఈ సునామీ మధ్య BSE 30 షేర్లలో 29 షేర్లలో పెద్ద క్షీణత కనిపిస్తోంది. కాగా, ఎన్‌టీపీసీ షేర్ 19.68 శాతం క్షీణించి రూ.314 వద్ద ట్రేడవుతోంది. ఇది కాకుండా, ఎస్‌బిఐ షేర్ 16.76 శాతం, పవర్‌గ్రిడ్ షేర్ 5.74 శాతం, టాటా స్టీల్ షేర్ 9.99 శాతం, టాటా మోటార్స్ 9.96 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 9.84 శాతం, రిలయన్స్ 9.67 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేరు 6.18 శాతం చొప్పున క్షీణించాయి.

Read Also:Chandrababu Naidu: జూన్ 9న చంద్రబాబు ప్రమాణస్వీకారం!

Exit mobile version