NTV Telugu Site icon

Stock Market: హరోంహర.. ఒక్కరోజులో రూ. 30 లక్షల కోట్ల సంపద ఆవిరి..

Sensex

Sensex

నేడు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆశించిన దానికంటే బీజేపీ ప్రభుత్వం సీట్లు రాకపోవడంతో ఆ సెంటిమెంట్ ఆధారంగా చేసుకుని దేశీయ స్టాక్ మార్కెట్లలో రక్తపాతం ఏర్పడింది. ఏ కంపెనీ సూచి చూసిన నష్టాల్లోనే కొనసాగింది. బేర్ దెబ్బకు ఇన్వెస్టర్లు విలవిలాడిపోయారు. దలాల్ స్ట్రీట్ చరిత్రలోనే అతిపెద్ద నష్టాలు నమోదు అయిన రోజుగా రికార్డ్ సృష్టించారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే ఏకంగా 30 లక్షల కోట్ల రూపాయలు తుడిచిపెట్టుకుపోయింది. అయితే బీజేపీ కి మెజారిటీ ఆధిక్యత ఉన్నప్పటికీ మార్కెట్లో ఎందుకు పడ్డాయోన్న విషయాన్ని పై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

Mahabubnagar: సీఎం సొంత ఇలాఖాలో కాంగ్రెస్ కు షాక్..బీజేపీ అభ్యర్థి అరుణ ఘన విజయం

నేడు ఉదయం నుంచి బేర్ గుప్పెట్లోకి వెళ్లిన స్టాక్ సూచీలు.. ఆ తర్వాత ఏ పరిస్థితుల్లో కూడా కోలుకోలేదు. దీంతో ఒకానొక దశలో 6000 పాయింట్లు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 70,234 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. అయితే ఆ తర్వాత మళ్లీ మార్కెట్లో పుంజుకొని మార్కెట్ నుంచి సమయానికి 4390 పాయింట్ల నష్టంతో 72 079 వద్ద ముగిసింది. ఇక మరోవైపు నిఫ్టీ 50లో దాదాపు 1379 పాయింట్లు మేర నష్టపోయి 21,884 పాయింట్లు వద్ద నిలిచింది.

YSR Health University: వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ నేమ్ బోర్డును ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు..

ఇక నేడు లాభపడిన సూచీల విషయానికి వస్తే.. హెచ్‌యూఎల్, టీసీఎస్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, సన్ ఫార్మా షేర్లులు మాత్రం లాభాల్లో ముగిశాయి. ఇక ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ఎక్కువగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.