NTV Telugu Site icon

Viral Video: నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? దానికిదే సాక్ష్యమా?

Ladder

Ladder

Stick ladder Walked in Postmortem Room: దెయ్యాలు ఉన్నాయంటే అది భ్రమ అలాంటివి ఏవి ఉండవని చాలా మంది కొట్టిపారేస్తూ ఉంటారు. అయితే ఇంకొద్ది మంది మాత్రం తాము దెయ్యాలని చూశామని, వాటితో మాట్లాడామని చెబుతూ ఉంటారు. అయితే వాటికి సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వాటిని నిరూపించలేకపోతున్నారు. ఇదిలా వుంటే మనం చాలా సినిమాల్లో ఆత్మలు వాటి దగ్గరలో ఉన్న బొమ్మలోకో, వస్తువుల్లోకో ప్రవేశించడం చూస్తూ ఉంటాం. అమ్మో బొమ్మ, టెడ్డీ లాంటి కొన్ని సినిమాలు ఇలాగే తెరకెక్కాయి. అయితే నిజంగా అలా జరిగే అది మనం చూస్తే తట్టుకోగలమా? ఖచ్ఛితంగా అక్కడి నుంచి అయితే పరుగులు తీస్తాం. ప్రస్తుతం నెట్టింట్లో అలాంటి ఓ వీడియోనే చక్కర్లు కొడుతుంది.

Also Read: Plane Crash: పార్టీ చేసుకుంటుండగా కుప్పకూలిన విమానం.. వైరల్ వీడియో

వైరల్ అవుతున్న వీడియో పోస్ట్ మార్టం రూంలో ఉన్న ఓ కర్రల నిచ్చెన నడుచుకుంటూ వెళుతుంది. అది అచ్చం మనిషి నడిచినట్టుగా నడుస్తుంది.ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ సంఘటన జరిగింది. ఇది ఎస్‌ఆర్‌ఎంఎస్‌ మెడికల్ కాలేజీ పోస్ట్‌మార్టం గదిలో  జరిగింది. ఆ గదిలో వెదురు కర్రలతో తయారు చేసిన ఒక నిచ్చెన ఉంది. అయితే ఉన్నట్టుండి ఆ నిచ్చెన నడుస్తూ ముందుకు కదిలింది. నిచ్చెనకు ఉన్న నాలుగు కర్రలు మనుషుల మాదిరిగా అడుగులు వేస్తూ నడిచాయి. మొదట ఈ వీడియోను కింద నుంచి షూట్ చేస్తే చూసే వారు దానిని పై నుంచి కదుపుతున్నారేమో దెయ్యం లేదు ఏం లేదు అనుకుంటారు. అయితే ఆ వీడియో తీసిన వారు కింద నుంచి క్రమంగా నిచ్చెన పై వరకు తీసుకువెళతారు. అయితే అక్కడ ఎవరు దానిని పట్టుకొని అలాగే దానికి ఎలాంటి తాళ్లు కట్టి నడింపించలేదు. అది దానంతట అదే నడుచుకుంటూ వెళుతుంది. ఒక్కసారిగా ఈ వీడియో చూస్తే మాత్రం ఒళ్లు గగుర్పొడుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.  కొద్ది సేపట్లోనే ఈ వీడియోను చాలా మంది చూసి ఇతరులకు షేర్ చేస్తున్నారు.

 

Show comments