NTV Telugu Site icon

INDvsAUS Test : సచిన్ రికార్డుపై కన్ను..టీమిండియా కాదు ఆసీస్ బ్యాటర్‌కే సాధ్యం

Sa

Sa

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. గురువారం (ఫిబ్రవరి 9) నుంచి జరగబోయే ఈ టెస్టులో కొన్ని రికార్డులు బ్రేకయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ పేరు మీదున్న రికార్డుపై ఆస్ట్రేలియా బ్యాటర్ కన్నేశాడు. అతడెవరో కాదు ఆసీస్ సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీల రికార్డుకు స్మిత్ రెండు సెంచరీల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకూ స్మిత్ 8 సెంచరీలు చేశాడు. సచిన్ 9 సెంచరీలతో టాప్‌లో ఉన్నాడు. ఈ పర్యటనలో భాగంగా స్మిత్ మరో రెండు శతకాలు బాదితే సచిన్ రికార్డు తిరిగరాసినట్లు అవుతుంది. ఒకవేళ ఒక సెంచరీ సాధిస్తే రికీ పాంటింగ్ (8)ను దాటి ఈ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు బాదిన ఆసీస్ క్రికెటర్‌గా ఫస్ట్ ప్లేస్‌లో నిలుస్తాడు. ఇక టీమిండియా బ్యాటర్‌ విరాట్ కోహ్లీ ఈ ట్రోఫీలో ఇప్పటివరకు 7 సెంచరీలు బాదాడు. మరో మూడు సెంచరీలు చేస్తే సచిన్ రికార్డు బ్రేక్ చేసినవాడవుతాడు.’

Also Read: Transgender Pregnant: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తండ్రి

కుంబ్లే రికార్డుకూ ఎసరు

ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్‌ కూడా ఓ రికార్డుపై కన్నేశాడు. ఇండియాపై 100 వికెట్ల రికార్డుకు ఇతడు 6 వికెట్ల దూరంలో ఉన్నాడు. ముత్తయ్య మురళీధరన్ తర్వాత ఇండియాపై ఇలా 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా లియోన్ నిలుస్తాడు. ఇప్పటి వరకూ లియోన్ 22 టెస్టుల్లో 94 వికెట్లు తీసుకున్నాడు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు (111) తీసుకున్న అనిల్ కుంబ్లే రికార్డుపై కూడా లియోన్ కన్నేశాడు. టీమిండియా స్పిన్నర్ అశ్విన్‌ను కూడా ఇదే రికార్డు ఊరిస్తోంది. ప్రస్తుతం ఈ ట్రోఫీలో 89 వికెట్లతో కొనసాగుతున్నాడు అశ్విన్. ఇక టెస్టుల్లో 450 వికెట్ల మైలురాయికి అశ్విన్ కేవలం వికెట్ దూరంలో ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా ఈ మైలురాయి అందుకున్న బౌలర్‌గా అశ్విన్ నిలుస్తాడు.

Also Read: Bollywood: ఆమిర్ రికార్డుని బద్దలుకొట్టిన షారుఖ్…