ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ సాంప్రదాయ ఫార్మాట్‌లో 10 వేల మైలురాయికి ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే స్మిత్ పెవిలియన్‌కు చేరాడు. స్మిత్ కెరీర్‌లో కీలక మైలురాయిని అందుకుంటాడని ఆసీస్ ఫాన్స్, క్రికెటర్స్ ఆశగా చూస్తున వేళ.. భారత పేసర్ ప్రసిధ్ కృష్ణ అతడిని ఔట్ చేశాడు. దాంతో కంగారో ఫాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా దీనిపై స్మిత్ స్పందించాడు. స్వదేశంలో కీలక మైలురాయి చేజారినందుకు బాధగానే ఉన్నప్పటికీ.. మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా ఆనందంగా అనిపించిందని పేర్కొన్నాడు.
బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ తరఫున స్టీవ్ స్మిత్ ఆడనున్నాడు. శనివారం పెర్త్ స్కార్చర్స్‌పై మ్యాచ్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఫాక్స్ స్పోర్ట్స్‌తో స్మిత్ మాట్లాడుతూ… ‘టెస్టుల్లో 10 వేల మైలురాయి మిస్ కావడం బాధగానే అనిపించింది. మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా ఆనందంగా కలిగించింది. ఒక్క పరుగు దూరంలో 0 వేల మైలురాయి ముందు ఆగిపోయా. స్వదేశంలో స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య సంబరాలు చేసుకొనే అవకాశం మిస్ అయింది. అలా జరిగిఉంటే చాలా సంతోషంగా ఉండేవాడిని. కానీ దురదృష్టం నన్ను వెక్కిరించింది. శ్రీలంకతో గాలె టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనే ఈ మార్క్‌ను దాటేస్తా’ అని ధీమా వ్యక్తం చేశాడు.
Also Read: Flipkart Monumental Sale 2025: ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్.. ప్రతి గంటకు కొత్త డీల్స్!
‘నేను ఎప్పుడూ రికార్డుల కోసం ఆడను. కానీ 10 వేల పరుగుల మైలురాయి గురించి మాత్రం చాలా రోజులుగా ఆలోచిస్తూ ఉన్నా. ఎందుకంటే టెస్టుల్లో అన్ని పరుగులు చేయడం చాలా కష్టం. 10 వేల పరుగుల మార్క్‌ను తాకితే.. నేను కూల్ అవుతా. ఇప్పటికీ నేను అత్యుత్తమంగా ఆడుతున్నట్లు భావిస్తా. నేను పేలవంగా ఆడిన రోజులు, పరుగులు చేయకుండా ఇబ్బందిపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మంచి ఇన్నింగ్స్ ఆడితే అన్ని సర్దుకుంటాయి. జట్టు విజయంతో భాగస్వామి కావడమే అన్నింటికంటే ముఖ్యం’ అని స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు 114 టెస్టుల్లో 9,999 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు ఉండగా, 41 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్మిత్ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 239.