గాయం కారణంగా చాలా కాలం గ్యాప్ తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా అదరగొట్టాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా అద్భుత ప్రదర్శన చేశాడు. తన స్పిన్ మాయాజాలంతో ఆసీస్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 47 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో ఆసీస్ స్టార్ బ్యాటర్లు లబుషేన్, స్టీవ్ స్మిత్ లాంటి భీకర బ్యాటర్లు ఉన్నారు. ముఖ్యంగా స్మిత్‌ను ఔట్ చేసిన విధానం మాత్రం అదిరిపోయింది. జడ్డూ వేసిన గుడ్ లెంగ్త్ డెలివరీని స్మిత్ డిఫెన్స్ చేయడానికి ప్రయత్నించగా.. బంతి అనూహ్యంగా మలుపు తిరిగి వికెట్లను గిరాటేసింది. ఫలితంగా స్మిత్(37) క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో ఒక్క క్షణం పాటు స్మిత్ రియాక్షన్ కూడా మారిపోయింది. ఆశ్చర్యపోయి అలాగే కాసేపు చూస్తుండిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
That 𝐌𝐎𝐌𝐄𝐍𝐓 when @imjadeja let one through Steve Smith's defence! 👌👌
Follow the match ▶️ https://t.co/SwTGoyHfZx #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/Lj5j7pHZi3
— BCCI (@BCCI) February 9, 2023
ప్రమాదకరంగా మారుతున్న లబుషేన్‌ను కూడా స్టంపౌట్‌తో పెవిలియన్ చేర్చాడు జడేజా. లంచ్ విరామానికి 76/2 వికెట్లు మాత్రమే కోల్పోయి మెరుగైన స్థితిలో ఉన్న ఆసీస్ జట్టును జడేజా తీవ్రంగా దెబ్బకొట్టాడు. ఫామ్‌లో ఉన్న లబుషేన్‌ను(49) వెనక్కి పంపగా.. తర్వాతి బంతికే మ్యాట్ రెన్‌షా(0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత స్మిత్‌ను తన మ్యాజిక్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక చివర్లో టాడ్ మర్ఫీ(0), హ్యాండ్సకంబ్‌ను(31) ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఫలితంగా 47 పరుగులిచ్చి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. గ్యాప్ తర్వాత ఆడిన తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసి ఔరా అనిపించాడు.
Also Read: Google Bard: ‘బార్డ్’ ఎంత పనిచేసింది..గూగుల్‌కు 100 బిలియన్ డాలర్లు మటాష్!