NTV Telugu Site icon

Steve Jobs Old Sandals: స్టీబ్‌ జాబ్స్ పాత చెప్పుల వేలం.. ధరెంతో తెలిస్తే షాకవుతారు?

Steve Jobs

Steve Jobs

Steve Jobs Old Sandals: యాపిల్‌ సహ వ్యవస్థాపకు స్టీవ్‌ జాబ్స్‌ ధరించిన చెప్పులను వేలం వేశారు. నిజమేనండి.. 1970ల కాలంలో వాడిన పాత చెప్పులను వేలం వేయగా.. వాటికి భారీ ధరను వెచ్చించి ఓ వ్యక్తి సొంతం చేసుకున్నారు. అమెరికాలో జూలియెన్స్ అనే కంపెనీ ఆదివారం నిర్వహించిన వేలంలో స్టీవ్ జాబ్స్ బిర్కెన్‌స్టాక్ కంపెనీ సాండ‌ల్స్ 2,20,000 వేల డాల‌ర్లు (మ‌న క‌రెన్సీలో రూ.1.78 కోట్లు) ప‌లికాయి. ఈ వేలం నవంబర్ 11న ప్రత్యక్షప్రసారం చేయబడగా.. నవంబర్‌ 13న వేలం ముగిసింది. గోధుమ రంగులో ఉన్న ఈ సాండ‌ల్స్‌ను 1970ల్లో స్టీవ్ జాబ్స్ ఉప‌యోగించాడు. వీటి మీద స్టీవ్ జాబ్స్‌ కాలి ముద్రలు ఉన్నాయి. అందుక‌ని ఈ చెప్పుల్ని ఒకాయ‌న కోటి డెబ్భయి ల‌క్షల‌కు వేలంలో సొంతం చేసుకున్నాడు.

వేలం హౌస్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. స్టీవ్ జాబ్స్ యాపిల్‌ చరిత్రలో చాలా కీలకమైన సందర్భాలలో ఈ చెప్పులను ధరించారు. 1976లో ఆయన యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్‌తో కలిసి లాస్ ఆల్టోస్ గ్యారేజీలో ఈ చెప్పులు ధరించి యాపిల్‌ కంప్యూటర్‌ను ప్రారంభించాడు. స్టీవ్ జాబ్స్ హోమ్ మేనేజర్ మార్క్ షెఫ్ దగ్గర ఈ చెప్పులు గతంలో ఉండేవి. వోగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, యాపిల్ సహ వ్యవస్థాపకుడి మాజీ భార్య క్రిస్సన్ బ్రెన్నాన్, మాట్లాడుతూ.. స్టీవ్ జాబ్స్ వార్డ్‌రోబ్‌లో చెప్పులు కూడా ఉండేవి. అవి ఆయన యూనిఫాంలో భాగం. యూనిఫాం ఎందుకంటున్నానంటే.. బట్టల మీద పెద్దగా దృష్టి పెట్టకపోయేవారు. యూనిఫాం పాటించడం వల్ల పొద్దున ఏ బట్టలు వేసుకోవాలనా అని.. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన వార్డ్ రోబ్‌లో ఈ చెప్పులు అత్యంత మామూలు విషయం’ అని ఆమె చెప్పింది. ఈ చెప్పులు 2017లో ఇటలీలోని మిలానోలోని సలోన్ డెల్ మొబైల్‌తో సహా పలు ప్రదర్శనల్లో భాగంగా ఉన్నాయి.

Narayana Murthy: దగ్గుమందుతో చిన్నారుల మరణాలు మనకు సిగ్గుచేటు

వేలంలో స్టీవ్ జాబ్స్ పాత సాండ‌ల్స్‌కి 60 వేల డాల‌ర్ల ధ‌ర వ‌స్తుంద‌ని అనుకున్నారు. ఈ సాండ‌ల్స్‌కి నాన్ ఫంజిబుల్ టోకెన్ ధ‌ర 2,18.750 డాల‌ర్లుగా నిర్ణయించారు. అయితే, రికార్డు స్థాయిలో రెండు ల‌క్షల ఇర‌వై వేల డాల‌ర్లు వ‌చ్చాయి. జూలియన్స్ కంపెనీ ఈ సాండ‌ల్స్‌ని కొనుగోలు చేసిన వ్యక్తి వివ‌రాలు మాత్రం వెల్లడించ‌లేదు.