Site icon NTV Telugu

Stellantis: ఒకేఒక్క ఫోన్ కాల్ తో 400 మంది ఉద్యోగులకు లేఆఫ్‌లు..!

13

13

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కారణంగా అనేక కంపెనీలు వారి ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే ఇటాలియన్ – అమెరికన్ ఆటోమేకర్ స్టెల్లాంటిస్ కంపెనీ ఒకేఒక్క ఫోన్ కాల్‌ తో అమెరికాలోని తమ ఇంజినీరింగ్, టెక్నాలజీ భాగాలలోని 400 మంది ఉద్యోగులను ఇంటికి పంపేసింది సదరు సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన ఫార్చ్యూన్ మేగజైన్ కథనం ప్రకారం.. మర్చి 22న కంపెనీ వారు రిమోట్ కాల్ చేసి ఉద్యోగులకు లేఆఫ్‌ లు ఇస్తున్నట్టు తెలిపింది.

Also Read: Rangareddy: రేపు హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి..?

స్టెల్లాంటిస్ కంపెనీకి భారత్, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాల నుండి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సేవలు అందిస్తుండగా.. వారు తక్కువ వేతనాలకే సమర్థవంతంగా పనిచేస్తుండడంతో వారిని ప్రోత్సహిస్తూ, రెగ్యులర్ ఉద్యోగులను తొలగించింది కంపెనీ. ఇక తొలగించిన ఉద్యోగులను ఉత్త చేతులతో అసలు పంపడం లేదని., సదరు తమ ఉద్యోగులకి పరిహార ప్యాకేజీ చెల్లిస్తున్నట్టు తెలిపింది కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా ఆటో ఇండస్ట్రీ ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.

Also Read: Bicycles on ORR: ఓఆర్‌ఆర్‌ ట్రాక్‌పై కిరాయి సైకిళ్లు.. గంటకు రూ.50 మాత్రమే..!

ట్విట్టర్ కంపెనీలో లేఆఫ్‌ లతో ప్రారంభమైన తీసివేతల పర్వం.. ఆపై ప్రముఖ టెక్ కంపెనీలకు పాకింది. దీంతో ఇప్పుడు వేలాదిమంది ఉద్యోగులు రోడ్డున పడినట్లైయింది. అయితే పరిస్థితి ఇప్పుడిప్పుడే మళ్లీ సద్దుమణుగుతున్న తరుణంలో ఈ ఏడాది మొదటి నుంచి మళ్లీ లేఆఫ్ లపై కంపెనీలు దృష్టిసారించాయి.

Exit mobile version