Site icon NTV Telugu

Viral: మలద్వారం లోపలికి స్టీల్ గ్లాస్.. వైద్యులు ఏం చేశారంటే?

Glass

Glass

బిహార్ పాట్నాలోని పీఎంసీహెచ్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ఓ వ్యక్తి ప్రైవేటు భాగాల్లో స్టీల్ గ్లాస్ ఇరుక్కుంది. ఈ షాకింగ్ ఘటన నవాదా జిల్లాలో వెలుగుచూసింది. ఓ వ్యక్తి మలద్వారంలోకి స్టీల్ గ్లాస్ చొచ్చుకెళ్లింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని పాట్నాలోని పీఎంసీహెచ్ ఆస్పత్రికి తరలించారు. తొలుత కేసు వివరాలు తెలుసుకుని డాక్టర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆపై పరీక్షలు చేసిన డాక్టర్లు.. మలద్వారం నుంచి గ్లాసును వెనక్కి తీయడం సాధ్యం కాదని నిర్ధారించుకున్నారు. ఎక్స్​రేలో కనిపిస్తున్న స్టీల్ గ్లాసుస్టీల్ గ్లాసు.. బాధితుడి మలద్వారంలో చాలా లోతుకు వెళ్లిందని వైద్యులు తెలిపారు. ఎక్స్​రేలో ఈ విషయం స్పష్టంగా తెలిసిందని చెప్పారు.

ఆపై డాక్టర్ వినయ్ కుమార్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల వైద్య బృందం విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. పొట్టకు ఆపరేషన్ నిర్వహించి గ్లాసును బయటకు తీశారు. ఆపరేషన్ పూర్తైన తర్వాత బాధితుడిని పర్యవేక్షణలో ఉంచారు. కొద్దిగంటల తర్వాత ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించినట్లు వివరించారు. గ్లాసు అతడి రహస్య భాగంలోకి ఎలా వెళ్లిందన్న విషయంపై వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడికి మతిస్థిమితం సరిగా లేదని బంధువులు చెబుతున్నప్పటికీ.. అతడు తమతో మామూలు వ్యక్తిలానే ప్రవర్తించాడని వైద్యులు పేర్కొన్నారు. స్టీల్ గ్లాసును బోర్లా వేసి దానిపై కూర్చున్నట్టు అతడు చెప్పినట్లు వెల్లడించారు. వైద్యులు ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మంత్రతంత్రాలు, పూజలను సాధన చేసేందుకే అతను గ్లాస్‌పై కూర్చొని ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే అది లోపలికి వెళ్లిపోయిందని చెబుతున్నారు.

Exit mobile version