మన శరీరానికి తగిన పోషకాలు అందనప్పుడు, ముఖ్యంగా ఐరన్, జింక్, విటమిన్స్ కొరత ఉన్నప్పుడు వాటి తాలూకు సంకేతాలు మన శరీరంలో చాలా స్పష్టంగానే కనిపిస్తూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఐరన్, జింక్, బీ విటమిన్ లోపాలు ఉన్నప్పుడు తగినన్ని ప్రోటీన్‌లు అందనప్పుడు నోటి చుట్టూ పగుళ్ళు వస్తుంటాయి. పోషకాల కొరతకు ఇదొక సంకేతం. తరచూ జుట్టు రాలిపోతూ ఉంటె ఒంట్లో బయోటిన్ అంటే విటమిన్ బీ 7 లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఓమేగా త్రీ, కొవ్వు ఆమ్లాల వంటి అత్యవసర కొవ్వులు, విటమిన్ ఏ, విటమిన్ డీ లోపాలు తలెత్తినప్పుడు బుగ్గలు, చేతులు, తొడలు, పిరుదుల పై మొటిమలు లాగా ఎర్రటి తెల్లటి బుడిపెలు కనిపిస్తుంటాయి.
Also Read : Extra Marital Affair: ఆమెకు 19, ఆయనకు 35.. వివాహేతర సంబంధం మోజులో ప్రియుడితో కలిసి..
మనలో కొంతమందికి అరచేతులు, పాదాలు మొద్దు బారి నట్టుగా అవుతుంటాయి. ఈ లక్షణం బీ విటమిన్ కొరతకు సంకేతం. ముఖ్యంగా విటమిన్ బి6, విటమిన్ బీ12 లోపిస్తే చేతులు, పాదాలు లోని నాడులు పై విపరీత ప్రభావం పడుతుంది. ఆందోళన, కుంగుబాటు, రక్తహీనత, నిస్సత్తువ, హార్మోన్లు అస్తవ్యస్తం కావడం వంటి వాటితోనూ ఇది ముడిపడి ఉండొచ్చు. ఇక కొంతమందికి తరచూ పిక్కలు కండరాలు పట్టేస్తుంటాయి. ఇందుకు చాలా వరకు మెగ్నిషియం, కాల్షియం, పోటాషియం వంటి లోపలే కారణంగా ఉంటాయి. జింక్ లోపించినప్పుడు గోడలపై తెల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. నాలుక మంటగా అనిపించడం వెనక కూడా పోషకాల కొరతే కారణంగా ఉంది. ఐరన్, విటమిన్ బీ3, విటమిన్ బీ2 లోపిస్తే నాలుక మంట, నొప్పి తలెత్తుతాయి. మన ఒంట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్న అప్పుడు అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ని సంప్రదించి తగిన వైద్య సాయం తీసుకోవాలి.