Site icon NTV Telugu

ధాన్యం సేకరణపై పార్లమెంట్ లో కేంద్రం ప్రకటన

వరిధాన్యం, బియ్యం సేకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. వరిధాన్యం కొనుగోలుపై లోకసభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సమాధానం ఇచ్చారు. 2018-19 లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి 48.06 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించగా, తెలంగాణ నుంచి 51.90 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు వివరించారు.

2019-20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, తెలంగాణ నుంచి 74.54 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ జరిగిందని స్పష్టం చేశారు. 2020-21లో ఏపీ నుంచి 56.67 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించగా, తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ చేశామని తెలిపారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఏజన్సీలు, “భారత ఆహార సంస్థ” సమన్వయంతో ( ఎఫ్.సి.ఐ) ధాన్యం సేకరణ చేస్తున్నాయని లోక్‌సభలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ నుంచే ఎక్కువ బియ్యం సేకరణ జరుగుందని గుర్తు చేశారు.

Exit mobile version