NTV Telugu Site icon

Ponnam Prabhakar : కేంద్ర మంత్రితో కలిసి దాండియా వీక్షించిన రాష్ట్ర మంత్రి పొన్నం

Bandi Sanjay Ponnam Prabhak

Bandi Sanjay Ponnam Prabhak

కేంద్ర మంత్రి బండి సంజయ్, తాను వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి విషయంలో మాత్రం రాజీలేకుండా పనిచేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లోని మహాశక్తి ఆలయానికి విచ్చేశారు. ఆలయ నిర్వాహకులు పొన్నంకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తో కలిసి మహాశక్తి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంజయ్ తో కలిసి ఆలయ ఆవరణలో నిర్వహించిన దాండియా కార్యక్రమాలను తిలకించారు. అంతకుముందు పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే….

 
Noida: గర్ల్‌ఫ్రెండ్‌‌ను ప్రియుడు కారులో తిప్పాలనుకున్నాడు.. స్నేహితులు ఏం చేశారంటే..!
 

కేంద్ర మంత్రి మా సొదరుడు బండి సంజయ్ నాయకత్వంలో మహాశక్తి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్న దసరా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్ధి రాజకీయాల నుండి నేను, బండి సంజయ్ క్రియాశీలకంగా పనిచేస్తూ ఈరోజు నేను రాష్ట్ర మంత్రిగా, బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఎదిగామన్నారు. రాజకీయాలు వేరు అని, మేం వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ కరీంనగర్ అభివృద్ధి విషయంలో మాత్రం రాజీ లేకుండా కలిసి పనిచేస్తామన్నారు. గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో శ్రమ పడి ప్రజల కోసం పనిచేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ఉంటూ అమ్మవారి ఆశీస్సులతో కేంద్ర స్థాయిలో బండి సంజయ్, రాష్ట్ర స్థాయిలో నేను జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకొచ్చేందుకు క్రుషి చేస్తామన్నారు. అమ్మవారి దయతో ప్రజలకు మరిన్ని సేవలు చేస్తామన్నారు.

Noida: గర్ల్‌ఫ్రెండ్‌‌ను ప్రియుడు కారులో తిప్పాలనుకున్నాడు.. స్నేహితులు ఏం చేశారంటే..!

Show comments