Site icon NTV Telugu

Nadendla Manohar: పంచాయతీ రాజ్‌ వ్యవస్థకు పోటీగా వలంటీర్ల వ్యవస్థను తెచ్చారు

Nadendla Manohar

Nadendla Manohar

అమరావతిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పంచాయతీలను కాపాడుకుందాం అనే అంశంపై జనసేన పార్టీ రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ చీఫ్ పవన్‌ కళ్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌, సర్పంచుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆయన వ్యాఖ్యనించారు. స్థానిక సంస్థల బలోపేతానికి జనసేన కట్టుబడి ఉంది అని నాదేండ్ల మనోహర్ తెలిపారు.

Read Also: Sagileti katha: చికెన్ చుట్టూ ‘సగిలేటి కథ’..ట్రైలర్ కి అనూహ్య స్పంద

రాష్ట్రంలో మార్పు తెచ్చే శక్తి జనసేనకు ఉంది అని పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహార్ అన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం నిధులిస్తున్నా.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది.. గ్రామ స్థాయిలో రాజకీయాలు ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే పార్టీ సింబల్‌ లేకుండా ఎన్నికలు జరుపుతారు.. గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు.. పన్నులు దారి మళ్లిస్తున్నారు అంటూ ఆయన ఆరోపించారు. స్థానిక సంస్థల బలోపేతానికి పోరాడేందుకు జనసేన సిద్దంగా ఉంది అని నాదేండ్ల మనోహార్ పేర్కొన్నారు.

Read Also: Taneti Vanitha: సానుభూతి కోసం ప్రభుత్వంపై చంద్రబాబు కుట్రలు

రాజకీయాలకతీతంగా స్థానిక సంస్థల బలోపేతం కోసం అందరూ పని చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన తెలిపారు. పంచాయతీ రాజ్‌ వ్యవస్థకు పోటీగా రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థను ఈ ప్రభుత్వం తీసుకు వచ్చిందని నాదేండ్ల మనోహార్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను పట్టించుకోవడం లేదని పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహార్ తెలిపారు. ఇప్పటికైనా పంచాయతీల బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు సిద్ధం కావాలని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version