Site icon NTV Telugu

Burra Venkatesham : విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ లో సంస్కరణలు తేవాలి

State Council

State Council

రాష్ట్ర విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్ లోని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (State Council for Education Research and Training) కార్యాలయం లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విద్యా పరిశోధన, శిక్షణ లో సంస్కరణలు తేవాలన్నారు. విద్యా శిక్షణ, పరిశోధన సంస్థ ప్రమాణాలు ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచేలా మంచి శిక్షణ, పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేయాలని అదేశించారు. ఉపాధ్యాయులకు విద్యార్థులను అనుసంధానం చేసేలా కార్యక్రమాలు ఉండాలన్నారు.

 

విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ను విద్యా అవసరాలకు ఉపయోగపడేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. TSEWIDC, ఓపెన్ స్కూల్స్, RJD school education, గ్రంధాలయ శాఖ, SCERT అధికారులు ఈ సమీక్ష లో పాల్గొన్నారు. సమీక్ష అనంతరం, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ కార్యాలయాన్ని, వివిధ అనుబంధ విభాగాలను క్షేత్ర స్థాయిలో అకస్మిక తనిఖీ నిర్వహించారు. తగు సూచనలు చేశారు. ఆఫీస్ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫైల్స్ ను భద్రపర్చాలని రాష్ట్ర విద్యా శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అధికారులను ఆదేశించారు.

Exit mobile version