Site icon NTV Telugu

Starlink Link India: భారత్‌లో స్టార్ లింక్ సేవలు.. విజయం అంత ఈజీ కాదుగా!

Star Link

Star Link

Starlink Link India: భారత మార్కెట్లో SpaceX సంస్థకు చెందిన స్టార్ లింక్ ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బాండ్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్న సంగతి విధితమే. అయితే, దీని అధిక ధర కారణంగా సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి రావడం కష్టంగానే కనపడుతుంది. స్టార్ లింక్ (Starlink) సేవలు ప్రస్తుతం ఉన్న జియో, ఎయిర్టెల్ లాంటి ప్రముఖ బ్రాడ్‌బాండ్ సేవల కంటే 10 నుండి 14 రెట్లు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తక్కువ భూమి కక్ష్య (LEO) ఉపగ్రహాల ద్వారా అందించే ఈ ఇంటర్నెట్‌ సేవలు ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా తక్కువ ధరకు అందడం కష్టమే.

Read Also: KL Rahul: కెఎల్ రాహుల్‌ను ‘మిస్టర్ ఫిక్సిట్’గా ప్రశంసించిన ఆసీస్ ప్లేయర్

కొన్ని నివేదికల ప్రకారం, స్టార్ లింక్ సేవలు కేవలం ప్రీమియం సర్వీసుగానే కొనసాగుతుందని అంచనా వేసాయి. అంతేకాకుండా, స్టార్ లింక్ వినియోగదారులకు అవసరమైన ఇన్‌స్టలేషన్‌కు ఖర్చు దాదాపు రూ.16,000 పైగా ఉండడంపై మరింత ప్రభావం చూపనుంది. అయితే స్టార్ లింక్ 200-250 Mbps వేగాన్ని అందించే అవకాశం ఉన్నప్పటికీ, భారత్‌లో సేవల విస్తరణలో కెపాసిటీ పరిమితులు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం 5G విస్తృతంగా పెరుగుతున్న కారణంగా స్టార్ లింక్ సేవలు కేవలం కొందరికి మాత్రమే పరిమితం అవుతాయని అంచనా వేస్తున్నారు.

ఇకపోతే తాజాగా భారతీ ఎయిర్టెల్, జియో ప్లాట్ ఫార్మ్స్ SpaceX తో కలిసి స్టార్ లింక్ సేవలను భారత్‌లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ భాగస్వామ్యం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు అధిక వేగం బ్రాడ్ బ్యాండ్ అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. జియో తన జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ కు అనుగుణంగా స్టార్ లింక్ సేవలను ఉపయోగించాలనుకుంటుంది. అయితే, స్టార్ లింక్ సేవలకు సంబంధించి ఇప్పటివరకు భారత ప్రభుత్వ అనుమతులు, స్పెక్ట్రం లైసెన్సులు పొందలేదు. అందువల్ల ఇది పూర్తి స్థాయిలో మొదలవ్వడానికి ఆలస్యమయ్యే అవకాశముంది.

Read Also: CP CV Anand: 35 ఏళ్ల తర్వాత ఒకేరోజు హోలీ, రంజాన్ రెండో శుక్రవారం.. సీవీ కీలక సూచనలు…

దీన్ని మొత్తంగా చూస్తే.. స్టార్ లింక్ సేవలు భారత్‌లో అధిక ధర, స్పెక్ట్రం అనుమతుల సమస్యలు, ఫైబర్ విస్తరణ వంటి అంశాలు దీనిని సాధారణ వినియోగదారులకు అందని ద్రాక్షగా మార్చవచ్చు. అయితే వ్యాపార అవసరాలు, దూరప్రాంతాల కనెక్టివిటీ, SME వినియోగదారులకు మాత్రం ఇది ప్రత్యేకమైన పరిష్కారంగా మారే అవకాశం ఉంది.

Exit mobile version