NTV Telugu Site icon

Star Hospitals: ఎండోస్కోపిక్ స్పైన్ సెంటర్‌లో అద్భుతమైన వైద్య చికిత్సలు..

Star

Star

కష్టతరమైన వెన్నెముక శస్త్ర చికిత్సలకు అత్యాధునిక పరిష్కారాలను అందిస్తూ.. స్టార్ హాస్పిటల్స్ సగర్వంగా తన అధునాతన ఎండోస్కోపిక్ స్పైన్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ నూతన సదుపాయం రోగులకు అధునాతన వెన్నెముక శస్త్రచికిత్సలను డే-కేర్ విధానాలుగా చేయగలుగుతుంది. ఇది అధిక రిస్క్ ఉన్నవారు, వృద్ధ రోగులు కొన్ని రోజుల్లోనే కోలుకోవచ్చు. అంతేకాకుండా..
అధిక రోడ్డు ప్రమాదాలు, నిశ్చల జీవనశైలి.. పెరుగుతున్న ఊబకాయం రేట్లు కారణంగా ప్రజలు అధికంగా వీపు మరియు వెన్నెముక సమస్యలని ఎదుర్కొంటున్నారు. దీని ఫలితంగా.. చాలా మంది బాధితులు తాత్కాలిక నొప్పి నివారణ కొరకు మరియు స్వల్పకాలిక ఉపశమనాన్ని అందించే నొప్పి నివారణ మందులు ఖరీదైన ఫిజియోథెరపీ సెషన్‌ల వైపు మొగ్గు మొగ్గు చూపుతున్నారు.

వెన్నెముక సమస్యలు చాలా సాధారణం అయినప్పటికీ.. తీవ్రమైన నొప్పి, నరాలు దెబ్బతినడం మరియు వాటి పనితీరు కోల్పోయే వరకు తరచుగా నిర్లక్ష్యం చేయబడతాయి. ఈ పరిస్థితులు జీవిత నాణ్యతను గణనీయంగా తగ్గిస్తాయి.. శారీరక శ్రమను తక్కువ చేస్తాయి. ఈ విధమైన నిర్లక్ష్యానికి ప్రధాన కారణం మనకు అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాలపై అవగాహన లేకపోవడమే. స్టార్ హాస్పిటల్స్ అధునాతన ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీని అందుబాటులోకి తీసుకురావడం వలన.. మినిమల్లీ ఇన్వాసివ్ ప్రక్రియ ద్వారా ఇది శరీరానికి తక్కువ గాయంతో పాటు వేగంగా ఉపశమనాన్ని అందిస్తుంది.

Thailand: థాయ్‌లాండ్‌లో కూలిన విమానం.. తెలియని ప్రయాణికుల జాడ!

ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ యొక్క ముఖ్య ప్రయోజనాలు:
● మినిమల్లీ ఇన్వాసివ్ ప్రక్రియ ఫలితంగా శరీరానికి తక్కువ గాయం.
● వేగవంతమైన రికవరీ, రోగులు శస్త్రచికిత్స తర్వాత 2 నుండి 3 గంటలలోపు నడవడానికి వీలు ఉంటుంది.
● రోగులు త్వరగా తమ సాధారణ జీవితాలకు తిరిగి పొందవచ్చు.

అపార నైపుణ్యం కలిగిన డాక్టర్ విశ్వక్ సేన రెడ్డి ఆద్వర్యంలో అడ్వాన్స్‌డ్ ఎండోస్కోపిక్ స్పైన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఎండోస్కోపిక్ సర్జరీ యొక్క జీవితాన్ని మార్చే ప్రయోజనాలను.. వ్యక్తిగతంగా అనుభవించిన నలుగురు వ్యక్తులు పాల్గొన్న రోగి నేతృత్వంలోని వేడుకను అధికారికంగా ప్రారంభించిన సందర్భంగా మా ముఖ్య అతిథి డాక్టర్ నీలం వి రమణా రెడ్డితో కలిసి వేదికను పంచుకున్నందుకు గౌరవంగా ఉంది. ఈ సందర్భంగా వైద్యం పొందిన వేమ రెడ్డి మాట్లాడుతూ.. “నాకు ఈ నొప్పితోనే జీవించాల్సి ఉంటుందని నేను భావించాను, అన్ని ఆశలు వదిలేశాను. ఒకసారి స్టార్ హాస్పిటల్స్‌లో వెన్నుముక శస్త్రచికిత్స చేయించుకున్న స్నేహితుడిని కలిశాను ఆ తర్వాత డాక్టర్ విశ్వక్ సేన రెడ్డిని సంప్రదించాలని నిర్ణయించుకున్నాను. అతను విధానాన్ని వివరించినప్పుడు, నాకు కొంత నమ్మకం వచ్చింది ఆ తరువాత శస్త్రచికిత్సకు అంగీకరించాను. శస్త్రచికిత్సకు గురైన తర్వాత, వెంటనే నాలో చైతన్యం వచ్చినప్పుడు నా నొప్పి నెమ్మదిగా తగ్గిందని తెలిసి ఆశ్చర్యపోయాను” అని చెప్పారు.

స్టార్ హాస్పిటల్స్‌లో ప్రముఖ వెన్నుముక శస్త్రవైద్యుడు డాక్టర్ విశ్వక్ సేన రెడ్డి అవగాహన ప్రాముఖ్యతను ప్రధానంగా తెలియజేశారు. “నా రోగులలో చాలామంది వారు శస్త్రచికిత్స తర్వాత వెంటనే నడవగలరని నమ్మడం కష్టం. ఎండోస్కోపిక్ విధానాల ప్రయోజనం అదే.. ఇది రోజువారీ శస్త్రచికిత్సలుగా సులభంగా చేయవచ్చు. ఇవి భారతదేశంలో కొన్ని కేంద్రాలలో మాత్రమే అందుబాటులో ఉన్న తాజా మరియు అత్యాధునిక శస్త్రచికిత్సలలో ఒకటి. ఈ చికిత్స ఎన్నుకోవడం గురించి అవగాహన పెంచడం చాలా ముఖ్యం. తద్వారా చాలామంది వారి వెన్నుముక సమస్యలకు మెరుగైన వైద్య పరిష్కారాలను పొందగలరు.

స్టార్ హాస్పిటల్స్‌లోని అధునాతన ఎండోస్కోపిక్ స్పైన్ సెంటర్ సరికొత్త ఎండోస్కోపిక్ టెక్నాలజీని ఉపయోగించి అధునాతన వెన్నెముక సంరక్షణను అందిస్తుంది. ఈ మినిమల్లి ఇన్వాసివ్ విధానం రోగులు వేగంగా కోలుకోవడానికి మరియు మరింత ఉపశమనంతో వారి సాధారణ జీవితాలకు తిరిగి రావడానికి సహాయపడుతుంది. ప్రత్యేకించి సాధారణ శస్త్రచికిత్స మరియు పోస్ట్-ఆప్ రికవరీ డౌన్‌టైమ్ ద్వారా వెళ్లాలనుకోని యువకులలో ఈ విధానం ఒక ఆశీర్వాదంగా మారవచ్చు.

స్టార్ హాస్పిటల్స్ న్యూరోసర్జరీ మరియు స్పెషలైజ్డ్ కేర్‌లో అగ్రగామిగా ఉంది. మా నూతన ఎండోస్కోపిక్ స్పైన్ సెంటర్ కేవలం వైద్యం ద్వారా రక్షించడమే కాకుండా జీవితాలను మెరుగుపరచడంలో మా అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో రోగుల సంరక్షణలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడం మాకు గర్వకారణం.

Jyothi Rai: తుంటరి చూపుతో.. చుట్టమల్లే చుట్టేస్తోన్న జగతి ఆంటీ.. ఫొటోస్ చూశారా..

స్టార్ హాస్పిటల్స్ గ్రూప్ గురించి – 16 సంవత్సరాల ప్రయాణం.

ఒక స్పెషాలిటీ హాస్పిటల్‌గా నిరాడంబరంగా ప్రారంభించి.. హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్స్ గ్రూప్ 35 సూపర్ స్పెషాలిటీలు మరియు 10 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను కలిగి ఉండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగులను ఆకర్షిస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అసాధారణమైన ఆరోగ్య సంరక్షణను అందించడంలో మా అచంచలమైన నిబద్ధత, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో మమ్మల్ని అత్యంత విశ్వసనీయమైన ఆరోగ్య సంరక్షణ గమ్యస్థానంగా మార్చింది. మా పేషంట్-కేంద్రీకృత విధానం మరియు అత్యాధునిక వైద్య సౌకర్యాలు వేలాది మంది రోగులు మరియు వారి కుటుంబాల విశ్వాసాన్ని పొందుతూనే ఉన్నాయి.

బంజారాహిల్స్ మరియు నానక్ రామ్‌గూడలో రెండు స్థానాల్లో.. మేము 600కి పైగా డెడికేటెడ్ పేషెంట్ కేర్ బెడ్‌లను అందిస్తున్నాము. ఈ క్రింది చెప్పినట్లు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రత్యేకతను కలిగి ఉన్నాము:
– హార్ట్ & మినిమల్లీ ఇన్వాసివ్ కార్డియాక్ సర్జరీ
– ఆర్థోపెడిక్స్ & జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ
– రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ
– న్యూరాలజీ & ఎండోస్కోపిక్ స్పైన్ సెంటర్
– ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ & క్రిటికల్ కేర్
– కిడ్నీ కేర్ & రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్
– గ్యాస్ట్రోఎంటరాలజీ & ఇన్వాసివ్ GI సర్జరీ
– కాలేయం, HPB & కాలేయ మార్పిడి
– క్యాన్సర్, హెమటాలజీ & బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్
– 24/7 ఎమర్జెన్సీ & ట్రామా కేర్.

మరిన్ని వివరాల కోసం మమల్ని సంప్రదించండి: 1800 102 7827.
మెడికల్ ఎమర్జెన్సీ కొరకు, దయచేసి 9071 104 108కి కాల్ చేయండి.