Site icon NTV Telugu

Heroines as Action Stars : మాస్‌ ఇమేజ్‌ కోసం ట్రై చేస్తున్న స్టార్ హీరోయిన్స్‌

Tollywood

Tollywood

హీరోయిజం అంటే కేవలం హీరోలకేనా కాదు అని నిరూపిస్తున్నారు నేటి తరం కథానాయికలు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు హీరోయిన్ సెంట్రిక్ యాక్షన్ సినిమాల హవా నడుస్తోంది. సమంత, రష్మిక, నయనతార వంటి స్టార్స్ ఇప్పుడు కత్తులు పట్టి, కండలు తిరిగిన విలన్లను చిత్తు చేస్తూ థియేటర్లలో ఈలలు వేయిస్తున్నారు. యాక్షన్ సినిమాలను నమ్ముకుని తన కెరీర్‌ను కొత్త పుంతలు తొక్కిస్తోంది సమంత. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో రాజీ పాత్రతో తనలోని యాక్షన్ కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆమె, ‘యశోద’, ‘సిటాడెల్’ సిరీస్‌లలో హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో అదరగొట్టింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న మా ఇంటి బంగారం చిత్రంలో కూడా సమంత ఒక పవర్‌ఫుల్ యాక్షన్ రోల్‌లో కనిపించబోతోంది. కేవలం యాక్షన్‌ను మాత్రమే నమ్ముకుని ఆమె చేస్తున్న ఈ ప్రయోగాలు సామ్ ఇమేజ్‌ను శిఖరానికి చేరుస్తున్నాయి.

Also Read : 2027 Box Office War : బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. నలుగురు స్టార్స్ దిగుతున్నారు

 నేషనల్ క్రష్ రష్మిక మందన్న సైతం ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ యాక్షన్ మూవీ మైసా తో సత్తా చాటడానికి సిద్ధమైంది. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం రష్మిక బ్యాంకాక్ వెళ్లి మరీ ప్రత్యేక శిక్షణ పొందుతోంది. రోజుకు ఏకంగా 8 గంటల పాటు కఠినమైన యాక్షన్ ట్రైనింగ్‌లో పాల్గొంటూ శారీరకంగా తనను తాను మలుచుకుంటోంది. ఈ సినిమా రష్మిక కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార తన తదుపరి చిత్రం రక్కయిలో ఊచకోత కోయడానికి సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తుంటే ఇది అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ అని అర్థమవుతోంది. మరోవైపు సంయుక్త మీనన్ కూడా రూట్ మార్చింది. ‘అఖండ 2’లో ఆమె ఫైటింగ్‌తో అలరించబోతుండగా, ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న ‘ది బ్లాక్ గోల్డ్’ చిత్రం కూడా కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. మొత్తానికి తెలుగు హీరోయిన్లు ఇప్పుడు ‘బ్యూటీ’తో పాటు ‘పవర్’ను కూడా చూపిస్తూ బాక్సాఫీస్ వద్ద తమదైన ముద్ర వేస్తున్నారు.

Exit mobile version