ఇటీవల స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగిందనే చెప్పాలి.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారు.. సోషల్ మీడియా పుణ్యమా అంటూ జనాలు ఎక్కువగా ఫోన్లకు అలవాటు పడ్డారు.. పొద్దున్న లేచింది మొదలు పడుకొనే వరకు చూస్తూనే ఉంటారు.. అయితే అలాంటి ఈ జనరేషన్లో కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఓ స్టార్ హీరోకి మాత్రం ఇప్పటికి సొంత మొబైల్ ఫోన్ లేదట.. ఏంటి నమ్మడం లేదు కదా.. కానీ ఇది నిజం.. అతను ఫోన్ ను వాడడట.. ఆ స్టార్ హీరో ఎవరో.. ఎందుకు వాడలేదో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
తమిళ హీరో అజిత్ తెలుగు వారికి కూడా సుపరిచితమే. ఈయన చేసిన చాలా సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి అభిమానులను కూడా సంపాదించుకున్నారు. అయితే అలాంటి అజిత్ కి ఇప్పటివరకు సొంతంగా ఫోన్ లేదట.. కోట్లు డబ్బులున్నా ఆయన స్మార్ట్ ఫోన్ ను వాడలేదట.. ఈ విషయాన్ని స్టార్ హీరోయిన్ చెప్పింది.. ఆమె ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. అజిత్ ఫోన్ ను అసలు వాడరు అని చెప్పింది.. ఒకవేళ ఆయనను కలవాలంటే కచ్చితంగా ఆయన స్టాఫ్ కు కాల్ చేసి అడగాల్సిందే అని చెప్పింది..
ఇకపోతే తన సినిమా గురించి మాట్లాడటం కోసం సిమ్ లను కూడా మారుస్తుంటారట.. ఒక సినిమా చేసిన తర్వాత ఆ సినిమా వాళ్లు మళ్లీ కాల్ చెయ్యకుండా ఉండాలని అనుకుంటారట.. అయితే చాలా మందికి ఇక్కడ సందేహం రావచ్చు.. మరో సినిమా కోసం ఎలా కాంటాక్ట్ అవుతారని.. డైరెక్టర్స్ ఆయనను నేరుగా కలిసి మాట్లాడుతారని సమాచారం.. సెల్యులర్ టెక్నాలజీ ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారని తెలుస్తుంది.. ఈ విషయం విన్న చాలా మంది షాక్ అవుతున్నారు.. నిజంగా అజిత్ ఆలోచన గ్రేట్..