Site icon NTV Telugu

ICC: రెండోసారి ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలిచిన స్టార్ బౌలర్..

Jasprit Bumrah

Jasprit Bumrah

డిసెంబర్ 2024 నెలలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం ప్రకటించింది. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పురుషుల విభాగంలో బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేన్ ప్యాటర్సన్‌లను ఓడించి బుమ్రా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్నాడు. ఈ అవార్డును బుమ్రా రెండోసారి గెలుచుకున్నాడు.

Read Also: a href=”https://ntvtelugu.com/news/rohit-sharma-joins-mumbai-ranji-trophy-teams-training-session-741229.html”>Rohit Sharma: ముంబై జట్టుతో ప్రాక్టీస్ చేసిన రోహిత్ శర్మ.. రంజీ ట్రోఫీలో ఆడటానికేనా..?

ఆస్ట్రేలియా పర్యటనలో బుమ్రా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. డిసెంబర్‌లో మూడు టెస్టుల్లో 14.22 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు. నాలుగు, ఐదో మ్యాచ్‌ల్లో తలా తొమ్మిది వికెట్లు తీశాడు. అదే సమయంలో.. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT)లో బుమ్రా మొత్తం 32 వికెట్లు తీశాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వెన్నుముక నొప్పితో అతను బౌలింగ్ చేయలేకపోయాడు. దీంతో.. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. కమిన్స్ నేతృత్వంలోని టీమ్‌తో సిరీస్‌ను భారత్ 1-3తో కోల్పోయింది.

Read Also: Stock Market: సంక్రాంతి జోష్.. లాభాలతో ముగిసిన సూచీలు.. అదానీ షేర్లు పరుగులు

ఫాస్ట్ బౌలర్ కమిన్స్ డిసెంబర్‌లో భారత్‌తో జరిగిన మూడు టెస్టుల్లో 17.64 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. శ్రీలంక, పాకిస్తాన్‌లపై అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టు విజయంలో ప్యాటర్సన్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. రెండు టెస్టుల్లో 16.92 సగటుతో 13 వికెట్లు తీశాడు. జూన్‌లో లండన్‌లో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్‌లోకి ప్రవేశించాయి.

Exit mobile version