NTV Telugu Site icon

Stampede At Railway Station: రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. పలువురికి గాయాలు

Mumbai

Mumbai

Stampede At Bandra Railway Station: ఆదివారం ఉదయం ముంబైలోని బాంద్రా టెర్మినస్‌లో భారీగా జనం రావడంతో తొక్కిసలాట జరిగింది. దీపావళి, ఛత్ పూజ సందర్భంగా.. ప్రజలు తమ ఇళ్లకు బయలుదేరుతుండగా, పెద్ద సంఖ్యలో గుమిగూడారు. దీని కారణంగా తొక్కిసలాట జరిగింది. నేటి ఉదయం ముంబైలోని బాంద్రా టెర్మినస్‌లో భారీగా జనం రావడంతో తొక్కిసలాట జరిగింది. దీపావళి సందర్భంగా, ప్రజలు తమ ఇళ్లకు చెరువువడానికి వెళ్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. దీని కారణంగా తొక్కిసలాట జరిగి 9 మంది గాయపడ్డారు.

Read Also: Karnataka: 1500 ఎకరాల భూమిపై వక్ఫ్ బోర్డు వాదనతో దిక్కుతోచని స్థితిలో రైతులు

ఆదివారం ఉదయం బాంద్రా టెర్మినస్, బాంద్రా (ఇ) ప్లాట్‌ఫారమ్ నంబర్ 1పై తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అయితే ఇద్దరి పరిస్థితి కాస్త ఆందోళన కరంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కూడా పరిస్థితిని అదుపు చేయలేకపోయినంత జనం భారీగా తరలివచ్చారు. ఈ సంఘటన తెల్లవారుజామున 2.25 గంటల ప్రాంతంలో జరిగింది. బాంద్రా గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు (రైలు నంబర్ 22921) ముంబై రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే, ప్రజలు అందులో ఎక్కడానికి పోటెత్తారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది.

Read Also: Rammohan Naidu: విజయవాడ-విశాఖ మధ్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు.. ప్రారంభించిన కేంద్ర మంత్రి