నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి సిబ్బంది తప్పిదం కావడం గమనార్హం. వేసవి సెలవులు కావడంతో ఇంటికి వెళ్లిన స్టూడెంట్స్ తిరిగి హాస్టల్‌కు రావడంతో.. వారి బట్టలు, సామాన్లు కనిపించలేదు. ఈ విషయం గురించి సిబ్బందిని అడగటంతో వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. విద్యార్థులు లేని సమయంలో హాస్టల్స్ రూముల తాళాలు పగల గొట్టిన సిబ్బంది.. విద్యార్థుల బట్టలు, సామాన్లు బయట పడేశారు. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, కాస్మోటిక్స్, డ్రెస్సెస్, సర్టిఫికెట్స్ బయట పడేసారని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Drone Show: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో డ్రోన్ షో
ఈ నెల 7వ తేదీ నుంచి విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ఉండటంతో వారు తిరిగి హాస్టల్ కు వచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు.. పడేసిన సామాన్లు కోసం వెతుక్కోవాలా? లేదా పరీక్షలు రాయాలా? అని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలకు ఏవైనా ఆటంకాలు కలిగితే.. అందుకు బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు, సిబ్బందే బాధ్యత వహించాలని హెచ్చరించారు. అయితే మరోవైపు రూమ్ లకు తాళాలు వేయవద్దు, ఎలాంటి సామాగ్రి రూమ్ లలో ఉంచవద్దని ముందే విద్యార్థులకు చెప్పాము అని ట్రిపుల్ ఐటీ యాజమాన్యం తెలిపింది.
Also Read : OPEC Plus: సౌదీ అరేబియా నిర్ణయంతో భారత్కు గట్టి ఎదురుదెబ్బ.. పెట్రోల్ ధరలు ఇక తగ్గనట్లే
రూమ్ ల మరమత్తులు, క్లీనింగ్ లో భాగంగా చెత్త ఒక వైపు, అవసరం వచ్చే సామాగ్రి మరో వైపు వేసాము అని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ వెల్లడించారు. సామాగ్రిని ఎక్కడ బయట పడేయలేదు అని డైరెక్టర్ అన్నారు.. స్టోర్ రూంలో భద్రపర్చామని తెలిపారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ట్రిపుల్ ఐటీ యాజమాన్యం తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.