Site icon NTV Telugu

SSMB29: రాజమౌళి, మహేష్ మూవీ మొదలయ్యేది ఎప్పుడంటే..?

Whatsapp Image 2024 01 22 At 3.46.08 Pm

Whatsapp Image 2024 01 22 At 3.46.08 Pm

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు తాజాగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వం లో ఎస్‌ఎస్‌ఎంబీ 28గా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుక గా జనవరి 12 న రిలీజ్ అయింది. మొదట్లో ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్ వచ్చిన కలెక్షన్స్ పరంగా ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం మహేశ్‌ బాబు ఎస్‌ఎస్‌ఎంబీ 29 తో బిజీ అవనున్నట్లు తెలుస్తుంది.తాజాగా ఎస్‌ఎస్‌ఎంబీ 29 నుంచి అభిమానులకు మంచి కిక్కిచ్చే అప్‌డేట్ బయటకు వచ్చింది.ఎస్‌ఎస్‌ఎంబీ 29 కు సంబంధించి డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసినట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. ఈ ఏడాది ఉగాది నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుందని తెలుస్తుంది..

అంతేకాదు ఆఫ్రికన్‌ అడ్వెంచరస్‌ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశానని, ఇందులో పాపులర్‌ హాలీవుడ్ యాక్టర్‌ కూడా నటించే అవకాశాలున్నాయని రైటర్ విజయేంద్రప్రసాద్‌ ఇదివరకే హింట్‌ కూడా ఇచ్చేశారు. ఈ చిత్రాన్ని 2026 ఉగాది కానుకగా విడుదల చేయనున్నట్టు సమాచారం.యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి లో తెరకెక్కించబోతున్న ఈ మూవీలో హిందీ యాక్టర్లతోపాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న స్టార్‌ యాక్టర్లను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇదే కనుక నిజమైతే జక్కన్న నుంచి మరో గ్లోబల్‌ అడ్వెంచరస్‌ మూవీ రావడం పక్కా అయిపోయినట్టే అని అంటున్నారు సినీ జనాలు. ఎస్‌ఎస్‌ఎంబీ 29 కోసం రామోజీఫిలిం సిటీలో ఏకంగా రూ.100 కోట్ల ఖర్చు తో భారీ సెట్‌లో షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. ఈ సెట్‌ లోనే మేజర్ పార్ట్ షూటింగ్ జరుగనున్నట్లు తెలుస్తుంది.మిగిలిన భాగాన్ని ఆఫ్రికా మరియు యూరప్‌ లో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.ఈ వార్త తెలుసుకున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఖుషి అవుతున్నారు.

Exit mobile version