Site icon NTV Telugu

SSMB 29: వెయ్యి కోట్లతో కౌంట్‌డౌన్.. మహేష్-రాజమౌళి సినిమా అందుకే ఆలస్యం?

Ssmb 29

Ssmb 29

SS Rajamouli-Mahesh Babu Movie News: ఈసారి ఎస్ఎస్ రాజమౌళి లెక్క వెయ్యి కోట్ల నుంచి స్టార్ట్ అయ్యేలా ఉంది. బాహుబలితో పాన్ ఇండియా రేంజే చూపించాడు కానీ.. ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు సినిమాతో పాన్ వరల్డ్‌ రేంజ్ అంటే ఏంటో చూపించడానికి సిద్దమవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ ఫేవరేట్‌గా మారిపోయిన జక్కన్న.. ఈసారి ఏకంగా హాలీవుడ్ సినిమానే చేయబోతున్నాడని చెప్పాలి. అందుకే.. ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమవుతోందని తెలుస్తోంది. గత కొంత కాలంగా అదిగో, ఇదిగో అనౌన్స్‌మెంట్‌ వచ్చేస్తోందని ఇండస్ట్రీ వర్గాలు ఊరిస్తూ వస్తున్నాయి. కానీ డిలే అవడానికి అసలు కారణం ఇదేనని అంటున్నారు.

గతంలో దర్శకధీరుడు రాజమౌళి కొన్ని హాలీవుడ్ సంస్థలతో టై అప్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అది హాలీవుడ్ యాక్టర్స్‌ను ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ చేయడం కోసమని అన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా నిర్మాణంలో కూడా ఓ హాలీవుడ్ సంస్థ భాగమయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ కెఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. కానీ హాలీవుడ్ రీచ్ కావడానికి.. ఓ ప్రముఖ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీని భాగస్వామ్యం చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా సమాచారం.

Also Read: Bhagyashri Borse: భాగ్యశ్రీకి బంపర్ ఆఫర్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్!

ఇప్పటికే రెండు మూడు హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలతో రాజమౌళి చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఏదో ఒక ప్రొడక్షన్ కంపెనీతో డీల్ ఓకే అయ్యాక సినిమా అనౌన్స్ చేస్తారని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. ప్రస్తుతం జక్కన్న హాలీవుడ్ కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ సినిమా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందనే చెప్పాలి. ఏదేమైనా ఈసారి మాత్రం ఊహకందని విధంగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారండంలో ఎలాంటి సందేహం లేదు.

Exit mobile version