NTV Telugu Site icon

Rajamouli-Rama Dance: ఆల్‌టైమ్‌ హిట్ పాటకు రాజమౌళి, రమ డ్యాన్స్‌.. రిహార్సల్‌ వీడియో వైరల్‌!

Rajamouli Dance

Rajamouli Dance

SS Rajamouli Dance Rehearsals Video goes viral: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ఇటీవల ఓ వివాహ వేడుకలో పాల్గొని తన సతీమణి రమతో డ్యాన్స్‌ చేసిన విషయం తెలిసిందే. హీరో, డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఆల్‌టైమ్‌ హిట్స్‌లలో ఒకటైన ‘అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే’ పాటకు వీరిద్దరూ స్టెప్పులేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. రాజ‌మౌళిలో ఈ టాలెంట్‌ కూడా ఉందా? అని అందరూ ఆశ్చర్యపోయారు. తాజాగా ఆ డాన్స్‌కు సంబంధించిన రిహార్సల్‌ వీడియో వైరల్‌గా మారింది.

‘అందమైన ‍ప్రేమరాణి చెయ్యి తలిగితే..’ పాటకు ఎస్ఎస్ రాజ‌మౌళి, రమలు డాన్స్ కొరియోగ్రాఫర్ సమక్షంలో రిహార్సల్‌ చేశారు. రాజమౌళి దంపతులతో పాటు మరికొందరు కూడా రిహార్సల్‌ చేశారు. అయితే అందరిలోకెల్లా దర్శకధీరుడి స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రాజమౌళి, రమ డ్యాన్స్‌ ప్రాక్టీస్ చేస్తున్న క్లిప్‌ను చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రాజ‌మౌళి మామూలోడు కాదు అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ సీఈవో, నిర్మాత చెర్రీ కుమార్తె వివాహంలో రాజమౌళి దంపతులు డాన్స్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: Vijay Deverakonda: అది ఇప్పటి ఫొటో కాదు.. క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ!

ఆర్ఆర్ఆర్‌ అనంతరం ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌ బాబుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. SSMB 29గా తెరకెక్కనున్న ఈ సినిమా పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది. యాక్షన్‌ అడ్వెంచర్‌గా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ పనిచేయనున్నారు. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ మహేశ్‌ బాబు సరసన నటించే అవకాశాలు ఉన్నాయి.