NTV Telugu Site icon

Shruti Haasan: హాలీవుడ్ కు వెళ్తున్న శ్రుతి హాసన్

Sruthi Hasan

Sruthi Hasan

Shruti Haasan: అగ్ర కథానాయకుల ఫస్ట్ చాన్స్ గా మారిన శ్రుతి హాసన్ చేతి నిండా పెద్ద సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా అమ్మడు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తాను ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించింది. కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ అని పేరు తెచ్చుకుంది ఈ బొమ్మ. తండ్రి ఓ సూపర్ స్టార్ అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపుకోసం కష్ట పడింది. తెలుగులో పవన్ కల్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాతో శ్రుతి సుడి తిరిగిపోయింది. దాంతో ఆఫర్లు క్యూ కట్టాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది.

Read Also: Brahmastra 2 : ‘బ్రహ్మాస్త్ర 2’ ను నిర్మిస్తామంటూ ముందుకొచ్చిన డిస్నీ

శ్రుతి హాసన్… బాలకృష్ణ తర్వాత సినిమా ‘ఎన్బీకే 107’, మెగాస్టార్ సినిమా ‘మెగా 154’ లో నటిస్తోంది. కాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా ‘సలార్’. ఇక ఈ సినిమాతో కన్నడలోనూ ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇక ఈ అమ్మడు రేంజ్ హాలీవుడ్ స్థాయికి వెళ్లిపోయింది. ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టింది. ఇక ” నేను గ్రీస్లో ఎందుకు ఉన్నానో అనే విషయం… మీతో పంచుకుంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అంతేకాదు ఈ ప్రత్యేక ప్రాజెక్టులో భాగమైనందుకు చాలా ఎక్సైట్ అవుతున్నా” అని రాసుకొచ్చింది.

Read Also: Kantara: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా ‘కాంతారా’.. అలా అనొద్దంటున్న దర్శకుడు

శ్రుతి హాసన్ ప్రస్తుతం గ్రీస్లో ఉంది. ‘ది ఐ’ అనే హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న సినిమా షూటింగ్లో పాల్గొంది. కాగా ఈ సినిమాలో శ్రుతి లీడ్ రోల్లో నటిస్తోంది. మేల్ లీడ్గా మార్క్ రోలే నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఎమిలీ కార్ల్టన్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఆర్గొనాట్స్ ప్రొడక్షన్స్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇక ఓ దీవిలో మహిళ తన భర్తను కోల్పోతుంది. అంతేకాదు ఆమె అదే దీవికి భర్త అస్థికలు అక్కడే వేయడానికి వెళ్తుంది. ఇక అప్పుడు ఆ మహిళకు ఎదురైన సంఘటనల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని సమాచారం.

Show comments