NTV Telugu Site icon

Srivari Pushkarini: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ రోజు నుంచే..

Srivari Pushkarini

Srivari Pushkarini

Srivari Pushkarini: తిరుమలలో నేటి నుంచి శ్రీవారి పుష్కరిణి మూసివేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది.. నేటి నుంచి నెల రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేయనున్నారు.. దీంతో, ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి రద్దు చేస్తున్నట్టు టీటీడీ పేర్కొంది.. అయితే, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొల‌గించి మ‌ర‌మ్మతుల‌ను పూర్తి చేయనున్నారు.. ఇక, మరమ్మతులు పూర్తి చేసి తర్వాత.. 10 రోజుల పాటు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా పరిశీలించి.. బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేయనుంది టీటీడీ.. కాగా, అధిక మాసం సందర్భంగా ఈ సారి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్న విషయం విదితమే. అధిక మాసం సందర్భంగా వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్‌ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా, అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలుగా నిర్వహిస్తామని వివరించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్‌ 18న ధ్వజారోహణం ఉంటుంది. బ్రహ్మోత్సవాల వేళ వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేయనున్నట్టు తెలిపారు. స్వయంగా వచ్చే ప్రముఖులకే బ్రేక్‌ దర్శనం కల్పిస్తున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి విషయం తెలిసిందే.

Read Also: Pawan Kalyan: ట్రిపుల్ సెంచరీ కొట్టేశావ్ ‘బ్రో’…