NTV Telugu Site icon

Srisailam: శ్రీశైలం దేవస్థానం ఈవో కీలక నిర్ణయం

Srisailam

Srisailam

Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. రద్దీ రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సెలవులు, శని, ఆది, సోమ వారాల్లో అలంకార దర్శనం మాత్రమేనని ఆయన వెల్లడించారు. శని,ఆది, సోమ వారాల్లో, రద్దీ రోజుల్లో ఉదయాస్తమాన, ప్రదోషకాల, ప్రాతకాల, గర్భాలయ, సామూహిక అభిషేకాలు, స్పర్శ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ధారించిన రోజులలో స్పర్శదర్శనం, అభిషేకాలు రద్దు వివరాలను వార్షిక క్యాలెండర్‌గా విడుదల చేయాలని నిర్ణయించారు.

Read Also: PM Modi- Stalin: తమిళనాడులో ఫెంగల్ తుఫాన్ బీభత్సం.. సీఎం స్టాలిన్కి ప్రధాని మోడీ ఫోన్‌‌‌

Show comments