NTV Telugu Site icon

Telangana Media Academy: మీడియా అకాడమీ ఛైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి..

Srinivas Reddy

Srinivas Reddy

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్గా శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ ఎం.హనుమంత రావు ఆదివారం నాడు ఉత్తర్వులు జారీచేశారు. శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా పనిచేశారు. అంతేకాకుండా.. గతంలో విశాలాంధ్ర పత్రికకు సంపాదకులుగా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి.. ప్రస్తుతం ప్రజాపక్షం ‘ఎడిటర్’ గా ఉన్నారు. కాగా.. అంతకుముందు అల్లం నారాయణ మీడియా అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు.