Srinivas Goud : ఎన్ని అక్రమ కేసుల పెట్టినా భయ పడేది లేదని, సోయల్ మీడియాలో పోస్టులు పెడితే మా కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇవాళ మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేసు నమోదు అయిన వరద భాస్కర్ కుటుంబాన్ని మేము పలకరించడానికి వెళితే భాస్కర్ తల్లి కన్నీరు పెట్టిందన్నారు. నన్ను చిత్రహింసలకు గురి చేశారని వరద భాస్కర్ మాతో ఆవేదన వ్యక్తం చేశారని, వికలాంగుల ఇళ్లు కూల్చి వారిని రోడ్డుపై పడేసారన్నారు. ఇప్పటికి ఇంకా చాలా ఇండ్లను కూ లుస్తామని భయపెడుతున్నారని, ప్రస్తుతం మహబూబ్ నగర్ లో సరైన వైద్యం అందడంలేదన్నారు శ్రీనివాస్ గౌడ్. పేదవాడికి వైద్యం అందలేదని మంచి హాస్పటల్ నిర్మాణం అప్పట్లోనే చేపట్టాలని ఆదేశాలు ఇచ్చానని, మహాయంలో ప్రారంభమైన హాస్పటల్ ను పూర్తి చేయడం ఇప్పటికి ఎమ్మెల్యేకు సాధ్యం కావడం లేదన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు కూడా మా హాయంలోనే ఇక్కడికి తీసుకు వచ్చామని, అసత్య ప్రచారాలలో మేము కాంగ్రెస్ వాళ్ళను ఓడించలేమన్నారు శ్రీనివాస్ గౌడ్.
Tirupati: కపిలేశ్వర స్వామి ఆలయంలో నెల రోజులు పాటు హోమాలు..
అంతేకాకుండా..’న్యాయం చేయమని అడిగితే అక్రమ కేసులు బనాయిస్తున్నారు…. ప్రశ్నించాలని చూస్తే మా నోరు మూయిస్తున్నారు…. ప్రభుత్వం అంటే పేద ప్రజల పక్షాల నిలబడాలి….. ఇక్కడ చెరువుల పేరు నారాల పేరు చెప్పి ఇండ్లను కూల్చి వేస్తున్నారు…. కూలగొట్టిన ఇంటి స్థానంలో పేదలకు తిరిగి కొత్త ఇల్లు కట్టివ్వాలి….. జర్నలిస్టులకు కూడా మేము ఇల్లు ఇచ్చాము….. గత బీఆర్ఎస్ పాలలో మహబూబ్నగర్ ను చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు…. పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నప్పుడే మాపై కేసు చేసి మమ్మల్ని లోపల్లో ఉంచకుండా ఎందుకు పంపారు… నేను ఇంటికి తిరిగి వెళ్ళిన గంటలోనే మీపై కేసు నమోదు చేస్తున్నామని పోలీసులు చెప్పడం విడ్డూరం…. మరి ఎవరు చెప్పారని నాపై కేసులో పంపడానికి ప్రయత్నిస్తున్నారా చెప్పాలి….. మీరు ప్రశ్నించొద్దని చెబితే ఇక మీరు జిల్లాలో ఏం చేసినా మేము నోరు తెరువం….. కేసులో పెడితే భయపడే రకం కాదు నేను….. మేము కేసుల వల్ల మమ్మల్ని మేలుకొలుపుతున్నారు….. మీరు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి… చంద్రబాబు వైఎస్సార్ తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడితే వారికి ఎదురు తిరిగిన వ్యక్తిని నేను…. అప్పుడు వాళ్లు నా మీద కేసులు పెడితేనే భయపడలేదు ఇప్పుడు మీరు చేస్తే భయపడతానా….’ అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.