NTV Telugu Site icon

Sukumar : దట్ ఈజ్ సుకుమార్.. ఆయన గొప్పతనానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది !

Sukumar

Sukumar

Sukumar : ‘పుష్ప 2’ కోసం దర్శకుడు సుకుమార్ మూడేళ్లపాటు అవిశ్రాంతంగా శ్రమించారు. కొన్ని లాజిక్స్, ల్యాగ్ పక్కన పెడితే అతను కోరుకున్న ఫలితాలను పొందాడు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప 3’ రానుందని తెలిపారు. అయితే ఇప్పుడే కాదు.. కొంత కాలం తర్వాత అని అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మరో మూడేళ్లు ఇస్తే చేస్తానని సుకుమార్ అన్నారు. అయితే ఇదంతా జరగడానికి కొంత సమయం పట్టవచ్చు. మరి ఈ గ్యాప్ లో సుకుమార్ ఏం చేస్తాడు.. అతడి కమిట్మెంట్స్ ఏంటి? నెక్ట్స్ ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేయాల్సి ఉంది. అయితే అందుకు సమయం ఉంది.

Read Also:Ponnam Prabhakar: ఏడాది పాలనపై హరీష్ రావు చార్జీషీట్.. పొన్నం ప్రభాకర్ కౌంటర్..

ప్రస్తుతం ‘పుష్ప 2 ది రూల్’ సినిమా బాక్సాఫీస్‌ ను షేక్ చేస్తూ రికార్డుల భరతం పడుతోంది. అటు విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంటుంది. ఈ క్రమంలో జరిగిన సక్సెస్ మీట్‌లో దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి పని చేసిన టీమ్ కి కృతజ్ఞతలు తెలుపుతూ, కొన్ని ఆసక్తికరమైన వివరాలను పెంచుకున్నారు. ట్రక్ ఎపిసోడ్, అలాగే చిన్ననాటి ఎపిసోడ్ వంటి కీలక సన్నివేశాలను తన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమాన్ దర్శకత్వం వహించాడని సుకుమార్ తెలిపాడు. ఐతే, దర్శకత్వం టైటిల్ కార్డ్‌లలో శ్రీమాన్ పేరును యాడ్ చేయనందుకు తాను ఫీల్ అవుతున్నట్లు సుకుమార్ చెప్పడం విశేషం.

Read Also:Instagram Love: పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ!

నిజానికి ఓ స్టార్ డైరెక్టర్ ఈ విధంగా ఓ అసిస్టెంట్ డైరెక్టర్ గురించి చెప్పడం అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సుకుమార్ గొప్పతనాన్ని నెటిజన్లు ప్రశంసిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఏది ఏమైనా ‘ఈ సినిమాకు నేను ద‌ర్శకుడిని కాదు.. వీళ్లంతా ద‌ర్శకులే. పొర‌పాటున నా పేరు వేసుకున్నా` అని సుకుమార్ చెప్పడం.. సుకుమార్ గొప్పతనానికి, సంస్కారానికీ నిదర్శనం. ఇక సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ‘పుష్ప 2: ది రూల్’ బాక్సాఫీస్‌పై తన ఆధిపత్యాన్ని బలంగా కొనసాగిస్తోంది. అన్ని ఏరియాల్లో సినిమాకి భారీ కలెక్షన్లు వస్తున్నాయి.