NTV Telugu Site icon

Sree Leela : రష్మికతో మాట్లాడాలంటే ఇబ్బంది పడ్డా.. శ్రీలీల ఇలా చెప్పిందేంటి..?

Sree Leela

Sree Leela

Sree Leela : శ్రీలీల చాలా రోజుల తర్వాత సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. నితిన్ సరసన ఆమె నటించిన రాబిన్ హుడ్ మూవీ మార్చి 28న రిలీజ్ కాబోతోంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో ఎలాగైనా హిట్ ట్రాక్ లోకి రావాలని నితిన్, శ్రీలీల ఎదురు చూస్తున్నారు. అందుకే ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పుష్ప-2 ఐటెం సాంగ్ చేసే సమయంలో రష్మికను చూసి ఇబ్బంది పడ్డట్టు శ్రీలీల చెప్పుకొచ్చింది.

Read Also : SK : శివకార్తికేయన్ ‘పరాశక్తి’ లో మరొక స్టార్ హీరో..?

ఎందుకంటే రాబిన్ హుడ్ సినిమాకు ముందు రష్మికనే తీసుకోవాలని అనుకున్నారు. ఆమెతో కొన్ని సీన్లు షూట్ చేసిన తర్వాత ఆమె ప్లేస్ లో శ్రీలీలను తీసుకున్నారు. ఆ టైమ్ లోనే పుష్ప-2 ఐటెం సాంగ్ చేస్తున్నామని.. అప్పుడు రష్మికతో మాట్లాడాలి అంటే కాస్త ఇబ్బంది పడ్డానని శ్రీలీల చెప్పుకొచ్చింది. కానీ డేట్స్ కుదరక తానే సినిమా నుంచి తప్పుకున్నట్టు రష్మిక తర్వాత చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నానని శ్రీలీల క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత తాను రష్మిక మంచి ఫ్రెండ్స్ అయ్యామని వివరించింది. రాబిన్ హుడ్ లో తన క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుందంటూ తెలిపింది ఈ అందాల భామ. ఈ సినిమా హిట్ అయితే శ్రీలీలకు మళ్లీ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది. వరుస ప్లాపుల తర్వాత ఆమె నుంచి వస్తున్న మూవీ ఇది. పుష్ప-2 ఐటెం సాంగ్ క్రేజ్ తో ఆమెకు మళ్లీ అవకాశాలు క్యూ కడుతున్నాయి. మరి రాబిన్ హుడ్ ఆమె కెరీర్ ను నిలబెడుతుందా లేదా అనేది చూడాలి.