NTV Telugu Site icon

IND vs SL Final: ఆసియా కప్ గెలిచిన భారత్.. ట్విటర్లో సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

New Project (1)

New Project (1)

IND vs SL Final: ఆసియా కప్ 2023 ఫైనల్‌లో టీమ్ ఇండియా శ్రీలంకను చిత్తుగా ఓడించింది. నిజం చెప్పాలంటే మ్యాచులో మన ఆటగాళ్లు అద్భుతం చేశారు. శ్రీలంక జట్టును ఏ టైంలో కోలుకోనివ్వకుండా చావు దెబ్బ కొట్టారు. ముఖ్యంగా హైదరాబాదీ ప్లేయర్ సిరాజ్ బౌలింగ్‌పై అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. వారందరూ సోషల్ మీడియాలో తమ తమ స్పందనలను తెలియజేస్తున్నారు.

Read Also:Ambati Rambabu: ముఖ్యమంత్రి జగన్పై నోరు పారేసుకునే ముందు పవన్ కళ్యాణ్ ఆలోచించుకున్నావా..?

ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ భారత్ శ్రీలంక మధ్య జరిగింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆసియా కప్ ట్రోఫీని గెలవాలన్నది ఇరు జట్ల కోరిక. దీంతో శ్రీలంక కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ నిర్ణయం అతడి బ్యాట్స్‌మెన్‌కు నచ్చలేదని తెలుస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కేవలం 50 పరుగులకే కుప్పకూలడానికి కారణం ఇదే.

Read Also:SBI Chocolate Scheme: ఎస్బీఐ కొత్త స్కీమ్.. ఈఎంఐ కట్టకపోతే ఇంటికి చాక్లెట్లు వస్తాయి

వన్డేల్లో శ్రీలంకకు ఇది రెండో అత్యల్ప స్కోరు. ఆసియా కప్‌లో ఏ జట్టు ఇంత అత్యల్ప స్కోరు చేయలేదు. ఆసియా కప్‌లో చాంపియన్‌గా నిలవాలంటే టీమ్‌ఇండియా 51 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఆరు వికెట్లు తీయగా, హార్దిక్ కూడా మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును మోకరిల్లేలా చేశాడు. టీమ్ ఇండియా ఆటగాళ్లు 6.1ఓవర్లోనే టార్గెట్ ఫినిష్ చేసి కప్ సొంతం చేసుకున్నారు.

Show comments