Supreme Court: శ్రీకృష్ణ జన్మభూమి వివాదానికి సంబంధించిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మే 26న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ షాహీ మసీదు ఈద్గా కమిటీ వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారించనుంది. మథుర కోర్టులో పెండింగ్‌లో ఉన్న వివాదానికి సంబంధించిన అన్ని కేసులను బదిలీ చేయాలంటూ అలహాబాద్ హైకోర్టు మే 26న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేసింది.
కాగా, శ్రీ కృష్ణ జన్మభూమితో పాటు షాహీ ఈద్గా వివాదం కేసులో అలహాబాద్ హైకోర్టు డిసెంబర్ 14న వివాదాస్పద స్థలాలను సర్వే చేయాలని ఆదేశించింది.. దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. అయితే, జనవరి 5న అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మథురలోని కృష్ణ జన్మభూమి జన్మస్థలాన్ని స్వాధీనం చేసుకుని హిందువులకు పూజల కోసం అప్పగించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టి వేసింది. ఈ వివాదంపై ఇప్పటికే హైకోర్టులో పెండింగ్ ఒకటి కంట ఎక్కువ కేసులును విచారించకూడదని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొనింది.