NTV Telugu Site icon

Rohit Sharma: ‘రోహిత్’ కాదు.. ‘నోహిట్’ శర్మగా పేరు మార్చుకో..

Srikanth Rohit

Srikanth Rohit

Srikanth Sensational Comments On Rohit Sharma: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకూ చాలా చెత్త ప్రదర్శన కనబరిచాడు. ఒక్క అర్థశతకం మినహాయిస్తే, అంతకుమించి గొప్పగా రాణించిన దాఖలాలు లేవు. జట్టుకి అవసరమైనప్పుడల్లా అతడు హ్యాండ్ ఇచ్చి, తీవ్రంగా నిరాశపరుస్తూనే ఉన్నాడు. ఈ మ్యాచ్ కాకపోతే తదుపరి మ్యాచ్‌లోనైనా రాణిస్తాడని అంచనాలు పెట్టుకున్న ప్రతీసారి, అతడు నీరుగారుస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ ఆడటం మానేసి, వడాపావ్ అమ్ముకో అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు భారత మాజీ ఓపెనర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ అతనిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన రోహిత్ శర్మ పేరును ‘నోహిట్ శర్మగా మార్చుకోవాలని సూచించాడు.

Islamabad Meeting: ఇస్లామాబాద్ సమావేశంలో చైనా, తాలిబన్ల మధ్య కీలక ఒప్పందం

Ipl Ad

మే 6వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ అవ్వగా.. ఆ వెంటనే కామెంట్రీ బాక్స్‌లో ఉన్న శ్రీకాంత్‌ అతని ఇన్నింగ్స్‌పై ఘాటుగా స్పందించాడు. ‘‘రోహిత్.. నీ పేరుని ‘నోహిట్ శర్మ’గా మార్చుకో.. నేనైతే రోహిత్‌ శర్మను ఎట్టి పరిస్థితుల్లోనూ జట్టులోకి తీసుకోను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రోహిత్ శర్మ అభిమానులైతే శ్రీకాంత్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్‌ను అవమానించే అర్హత నీకు లేదంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ఒకప్పుడు రోహిత్ ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాడని, ప్రతిఒక్కరికీ ఏదో ఒక సమయంలో బ్యాడ్ డేస్ వస్తాయని, అంత మాత్రాన వారిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

Mark Zuckerberg: మొదటి టోర్నమెంటే.. కానీ బంగారు, రజతాలను గెలిచేశాడు..

ఇదిలావుండగా.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లో ఆడిన రోహిత్, కేవలం 184 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే.. సీఎస్కేతో మ్యాచ్‌లో డకౌట్ కావడంతో, ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన బ్యాటర్‌గా (16) చెత్త రికార్డ్‌ని మూటగట్టుకున్నాడు. అంతకుముందు ముందు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ డకౌట్ అవ్వడంతో.. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన కెప్టెన్‌గానూ (11) రోహిత్ మరో చెత్త రికార్డ్‌ని తన పేరిట లిఖించుకున్నాడు.