NTV Telugu Site icon

మూలిగే ‘పొట్టేల్’ పై శ్రీకాంత్ అయ్యంగార్ బాంబ్

Whatsapp Image 2024 10 26 At 14.09.23

Whatsapp Image 2024 10 26 At 14.09.23

ప్రతివారం సినిమాలు రిలీజ్ అవ్వడం,వాటిపై రివ్యూయర్స్ సమీక్షలు రాయడం అనేది ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ప్రక్రియ.అయితే రివ్యూ అనేది ఆ సమీక్షకుడి దృష్టి కోణం మాత్రమే.బావున్న సినిమాకి బ్యాడ్ రివ్యూస్ వచ్చినంత మాత్రాన అది ఫ్లాప్అయిపోదు.ఫ్లాప్ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చినంత మాత్రాన అది హిట్ అయిపోదు. లేటెస్ట్ గా వచ్చిన పొట్టేల్ సినిమా అంత గొప్పగా ఏం లేదు.తీసుకున్న పాయింట్, దాన్ని చెప్పిన విధానం చాలామందికి నచ్చలేదు.తలా తోకలేకుండా సినిమా తీసాడు అనే టాక్ ప్రీమియర్స్ లోనే వినిపించింది.అదే విషయాన్ని రివ్యూయర్స్ తమ రివ్యూస్ లో చెప్పుకొచ్చారు.కానీ సినిమా హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ పెట్టడం అనే ఆనవాయితీ ఎక్కువగా నడుస్తుంది కాబట్టి ఆ సినిమాకి కూడా అదే విధంగా ప్రెస్ మీట్ పెట్టారు. సినిమా యూనిట్ వాళ్ళ అభిప్రాయం చెప్పుకొచ్చారు.ఇంతవరకు బాగానే ఉంది.

ఆ ఫంక్షన్ కి లేట్ గా, ఆల్మోస్ట్ ప్యాకప్ టైం లో వచ్చాడు టైం సెన్స్ అస్సలు లేని శ్రీకాంత్ అయ్యంగార్.మామూలుగానే అతని మాటలు కాస్త వంకరగా ఉంటాయి.కాకపోతే టాలెంట్ ఉంది కాబట్టి మిగతావి పట్టించుకోకుండా అవకాశాలు ఇస్తుంటారు సినిమా దర్శకనిర్మాతలు.
అలాంటి శ్రీకాంత్ అయ్యంగార్ కి పొరపాటున మైక్ ఇచ్చి పొట్టేల్ గురించి పొగడమన్నారు.కానీ బీరు తాగడం,దానిపై రివ్యూస్ఇవ్వడం , దానిని పొగడడం మాత్రమే బాగా అలవాటు చేసుకున్న శ్రీకాంత్ అయ్యంగార్ సినిమాలకి రివ్యూస్ రాసేవాళ్ళని,మీడియాని చెప్పడానికి కూడా వీలు లేని భాషలో దారుణంగా తిట్టాడు.సంస్కారం అనేది మచ్చుకు కూడా లేనట్టు ప్రవర్తించాడు.మనం ఎక్కడున్నాం,ఏం మాట్లాడుతున్నాం అనే సోయ లేకుండా ప్రవర్తించాడు.దీంతో అంతా అతని పై దుమ్మెత్తిపోస్తున్నారు. అతని పై కఠిన చర్యలు తీసుకోవాలని, మీడియాకి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్స్ చేస్తున్నాయి అన్ని మీడియా సంఘాలు.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని వెబ్ సైట్స్ ఇచ్చిన రివ్యూస్ తాలూకా రేటింగ్స్ కూడా వాడారు సినిమా యూనిట్.ఇప్పుడు వాటిపై కొత్త చర్చ నడుస్తుంది.అలా ఆ సినిమాకి మంచి రేటింగ్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా శ్రీకాంత్ అయ్యంగార్ మాటలు అప్లికబుల్ అవుతాయా?, వాళ్లకీ కూడా సినిమా గురించి ఏం తెలియదా?, అందుకే అలా రాశారా అంటూ సెటైర్స్ పేలుతున్నాయి.వర్డ్ ఆఫ్ మౌత్ లో కూడా మ్యాటర్ లేకపోవడంతో పొట్టేల్ ప్రమాదం అంచున నిలబడింది.అసలే అంచనాలు అందుకోలేక థియేటర్స్ లో మూలుగుతున్న పొట్టేల్ కి శ్రీకాంత్ అయ్యంగార్ నోటిదూల మరింత కష్టమయిన పరిస్థితులు తెచ్చింది.ఎన్నో మంచి సినిమాలు మీడియా పుష్ వల్ల, వాళ్ళు చెప్పిన, రాసిన మంచి మాటలవల్ల బ్రతికి బట్టకట్టిన సందర్భాలు అనేకం.జనరంజకంగా సినిమా తియ్యలేక,చూసిన వాళ్ళని, దాని గురించి రాసినవాళ్ళని తప్పుబట్టడం దారుణం.అయితే వేదికపై ఉన్న టీమ్ కూడా దీనికి సారీ చెప్పే ప్రయత్నం చెయ్యకుండా చప్పట్లు కొట్టడం ఇక్కడ మరో కొసమెరుపు.