Site icon NTV Telugu

Tollywood : ‘ప్రబల తీర్థం’ నేపథ్యంతో శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమా

Sreekanth Addala

Sreekanth Addala

గోదావరి.. కొనసీమ ప్రాంతం కేవలం పచ్చని పొలాలు, నదీ ప్రవాహాలకే కాదు,  పలు సంప్రదాయాలకు, విశ్వాసాలకు, అతిధి మర్యాదలకు ప్రతిబింబం. గోదావరి ప్రాంతాల వారి మర్యాదలకు ఎవరైనా శెభాష్ అనాల్సిందే. అలాగే ఆ ప్రాంతంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ప్రబల తీర్థం ఒకటి. భక్తి, త్యాగం, సమూహ భావం మేళవించిన ఈ పండుగ చుట్టూ మానవ సంబంధాలు, అంతర్మథనాలు, భావోద్వేగాలు కలగలిపిన ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు అక్కడి ప్రజలు. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే ఈ ప్రభల తీర్ధం ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది.

Also Read : OTT : మూవీ లవర్స్‌కు ఈ వారం ఓటీటీలే దిక్కు..

అయితే ఈ ఉత్సవాలను సినిమా రూపంలో తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సున్నితమైన కథలను వెండితెరపై ఆవిష్కరించే దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహోత్సవం, ముకుందా ఆ కోవాలోవనివే. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల కొనసీమ నేపథ్యంలో, అక్కడి ఆధ్యాత్మిక సంప్రదాయమైన “ప్రబల తీర్థం” నుంచి ప్రేరణ పొందిన ఒక కథను రెడీ చేస్తున్నారని సమాచారం. శ్రీకాంత్ అడ్డాల సినిమాలు ఎప్పుడూ చిన్నచిన్న భావోద్వేగాలతో  రియలిస్టిక్ గా ఉంటాయి. అలాంటి దర్శకుడు కొనసీమ లాంటి సాంస్కృతికంగా సంపన్నమైన ప్రాంతాన్ని, అక్కడి ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని కథా నేపథ్యంగా తెరకెక్కిస్తున్నాడంటే కొనసీమ, సంప్రదాయాలను కలిపి తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

Exit mobile version