Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం.. అసలు ఏం జరిగిందంటే..?

Srikalahasti Temple

Srikalahasti Temple

Srikalahasti Temple Fire: శ్రీకాళహస్తి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. ఆలయంలోని అన్నప్రసాద ప్రధాన వంటశాలలో ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఒక సిలిండర్ పేలిన వెంటనే పక్కనే ఉన్న ఇతర సిలిండర్లకు సైతం మంటలు వ్యాపించాయి.. దీంతో వంటశాలలో భారీగా మంటలు ఎగిసి పడ్డాయి.. పేలుడు శబ్దంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు.. మరోవైపు పోటులో ప్రసాదాలు తయారు చేస్తున్న కార్మికులు బయటకు పరుగులు తీశారు.. మంటలను అదుపు చేసేందుకు ఆలయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..