Site icon NTV Telugu

Extramarital Affair: భార్య వివాహేతర సంబంధం.. ఆత్మహత్యకు పాల్పడిన భర్త, కుమార్తె!

Extramarital Affair

Extramarital Affair

భార్య వివాహేతర సంబంధం భరించలేక ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందుగా కుమార్తెకు విషం ఇచ్చి, అనంతరం తాను తాగి ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయే ముందు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. భార్య, ఆమె ప్రియుడు పరారీలో ఉన్నారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామంలో చోటుచేయుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న భార్య, ప్రియుడి కోసం వెతుకుతూన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి…

Also Read: YS Sharmila: మెడలో ఉల్లిపాయల మాల వేసుకున్న షర్మిళ.. అడ్డుకున్న పోలీసులు!

సంచాం గ్రామానికి చెందిన సంతోష్‌కి, జీరుపాలాం గ్రామానికి చెందిన స్వాతికి 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో సంతోష్, స్వాతిల వివాహబంధం సాఫీగా సాగింది. ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. కొన్నాళ్లుగా స్వాతి సంచాం గ్రామానికి చెందిన రాంబాబుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం సంతోష్‌కి తెలియగా.. తన భార్య స్వాతిని హెచ్చరించాడు. అయినా కూడా స్వాతి మారలేదు. భార్య వివాహేతర సంబంధంను సంతోష్‌ భరించలేకపోయాడు. సెల్ఫీ వీడియో విడుదల చేసి.. కుమార్తెకు విషం ఇచ్చి అనంతరం తాను తాగాడు. ఘటనా స్థలంలోనే సంతోష్ మృతి చెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుమార్తె హైమా మృతి చెందింది. భార్య స్వాతి, ప్రియుడు రాంబాబు పరారీలో ఉన్నారు. సంతోష్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Exit mobile version