Duddilla Sridhar Babu : తెలంగాణ రాష్ట్రంలో పాలనపై విమర్శలు గుప్పిస్తూ మంత్రి శ్రీధర్ బాబు బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం పై భరోసా వ్యక్తం చేస్తూ, బీఆర్‌ఎస్ గతంలో చేసిన తప్పిదాలను ప్రజలు మర్చిపోలేరని పేర్కొన్నారు. “రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది – ఆయనే కొనసాగుతారు” అంటూ స్పష్టంగా తెలిపారు. ఇక బీజేపీ ఎంపీ అరవింద్ పై విమర్శలు చేస్తూ, “అరవింద్ నిద్రలో కలలు కంటున్నట్టు ఉన్నారు” అన్నారు.
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత పదేళ్ల పాలనలో కేటీఆర్ 10 నుండి 15 వేల కోట్ల వరకు బ్రోకర్లకు పంపించాడని, దాని మీద ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. “మేము మర్చంట్ అంటున్నాం.. ఆయన బ్రోకర్ అంటున్నారు,” అంటూ విమర్శించారు. “మీలాగా మేము 12 శాతం వడ్డీకి రుణాలు తీసుకోలేదు” అంటూ ఎద్దేవా చేశారు. మూసి వరదల సమయంలో ప్రజలను రెచ్చగొట్టిందెవరో, అడ్డుకున్నదెవరో ఇప్పుడైనా బీఆర్‌ఎస్ చెప్పాలన్నారు.
“హరితహారం” పేరుతో 9 వేల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ఎన్ని చెట్లు మిగిలాయో చెప్పాలన్నారు. 207 చెట్లు సచివాలయ నిర్మాణానికి కొట్టారని, వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటారా? అని ప్రశ్నించారు. “111 జీఓతో 12 లక్షల చెట్లు కొట్టారు, కానీ నేటికీ గ్రీన్ స్టేట్ కాలేదు” అన్నారు. “నియోపోలీస్” లో చెట్లు కొట్టడం, భూముల అమ్మకాలు – అన్నీ ప్రజలకు చెబుతూ వస్తున్నారు అని మంత్రి అన్నారు. రాయదుర్గం, మొకిల, ఖానామేట్ ప్రాంతాల్లో భూములు విక్రయించినప్పుడు పర్యావరణం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో రీస్ట్రక్చరింగ్ లోన్ కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం బ్యాంకులకు “వాటర్ ట్యాక్స్ వసూలు చేసి కడతాం” అని చెప్పినదే తప్ప మరొకదేమీ కాదన్నారు. మిషన్ భగీరథలోనూ ఇదే తంతు కొనసాగిందని, గ్రామీణ ప్రాంతాల్లోకి నీళ్లు ఇచ్చి రూ.12 వసూలు చేస్తామంటూ బ్యాంకర్లను మోసగించినట్టు ఆరోపించారు. “ప్రజలకు పచ్చబోళ్లు చెప్పిన వారిని ఇప్పుడు మేము నిలదీస్తున్నాం” అంటూ ముగించారు శ్రీధర్ బాబు.
Bengal violence: బెంగాల్ హింసపై ఎన్ఐఏ దర్యాప్తు చేయాలి.. కేంద్రాన్ని కోరిన బీజేపీ నేత..